జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు
వేమనపల్లి, సెప్టెంబర్ 2 : మండలంలో హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు సూచించారు. గురువారం మండలంలోని నీల్వాయిలోని రైతు వేదిక భవనంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. రోడ్ల పక్కన, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలను సంరక్షించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులపై త్వరలో సెంట్రల్, స్టేట్ కమిటీ బృందాలు మండలంలో పర్యటించనున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈజీఎస్ పనులకు సంబంధించి రికార్డులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి రోజూ పారిశుధ్య పనులను నిర్వహించాలని సూచించారు. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి డీఎల్పీవో ఫణీందర్‌రావు, ఎంపీవో అనిల్‌కుమార్, ఏపీవో సత్య ప్రసాద్, ఈసీ మధుకర్, సాంకేతిక సహాయకులు , పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు సూచించారు. గురువారం నీల్వాయిలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం వండే చోటును పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట డీఎల్పీవో ఫణీందర్‌రావు, ఎంపీవో అనిల్‌కుమార్, సర్పంచ్ గాలి మధు, ప్రధానోపాధ్యాయుడు సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి నారాయణ , ఉపాధ్యాయులు ఉన్నారు.