
సారంగాపూర్, జనవరి 2: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ-2021 కార్యక్రమంలో భాగంగా మండలంలోని చించోలి(బీ) గ్రామంలో ఆదివారం కేంద్రం బృందం సభ్యుడు సతీశ్ కుమార్ పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఇంకుగుంతలు, మరుగుదొడ్లను పరిశీలించారు. వాటిని వినిగిస్తున్నారో లేదో తెలుసుకున్నారు. ఆరుబయట మలవిసర్జనకు వెళ్లవద్దని, మరుగుదొడ్లు నిర్మించుకొని ఉపయోగించుకోవాలని సూచించారు. మురికి నీరు రోడ్లపైకి వెళ్లకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను శుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ చాట్ల లక్ష్మి, ఎంపీడీవో సరోజ, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఫైనాన్స్ డీపీఎం బొడ్డు రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, నాయకుడు రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
లక్ష్మణాచంద, జనవరి 2 : పీచర గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం పర్యంటిచింది. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ టీం సభ్యుడు భరత్, ఎంపీడీవో శేఖర్, ఈవోపీఆర్డీ నసీరొద్దీన్, ఏపీవో దివ్య, సర్పంచ్ బుర్రి లత, కార్యదర్శి సాయి శృతి పాల్గొన్నారు.
కుంటాల, జనవరి 2 : మండలంలోని ఓల గ్రామంలో కేంద్ర బృందం సర్వే నిర్వహించింది. ఎంపిక చేసిన గ్రామంలో పరిమాణాత్మక, గుణాత్మక సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేసింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం, ఇంకుడు గుంతలు, ఆలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలోల్లో సౌకర్యాలు, పరిశు భ్రత, రహదారుల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. సర్పంచ్ ఖనిష్ ఫాతిమా ఆధ్వర్యంలో గ్రామస్తులు అధికారులకు స్వాగతం పలికారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమం లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అధికారి సునీల్‌గౌడ్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎల్పీవో శివకృష్ణ, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, సర్పంచ్ ఖనీష్ ఫాతిమా, ఎంపీటీసీ రవి, ఏపీవో గట్టుపల్లి నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.