
ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
ఆదిలాబాద్ రూరల్, జనవరి 2 : ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా దుర్గానగర్‌లో నాటిన మొక్కల రక్షణ కోసం స్ప్రింక్లర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదిలా బాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్క్నొరు. కౌన్సిలర్ ఉష్కం రఘుపతితో కలిసి ఆదివారం వా టిని ప్రారంభించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు అర్బన్ పార్కును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా నాటిన మొక్కలను సంరక్షించి చిట్టడవుల్లా తయారు చేస్తామన్నారు. కౌన్సిలర్ భరత్, నాయకులు ఆనంద్, రామ్‌కుమార్, స్వరూపారాణి, బొడగం మమత పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి..
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పట్టణం అభివృద్ధి చెందిందని మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని 19, 20వ వార్డుల్లో జరుగుతున్న బీటీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. రూ.20 లక్షలతో ఇందిరా నగర్ నుంచి భీంసరి శ్మశానవాటిక వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
త్వరలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు ప్రారంభం
జిల్లా కేంద్రంలో త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన పనులను ప్రారంభిస్తామని మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తుందని నమ్మకంగా ఉన్నామన్నారు. పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అవసరమైతే రాజీనామా చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. మీడియాకు తన రాజీనామా పత్రా న్ని చూపించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, ప్రతిపక్ష నేతలు అవాస్తవాలు ప్రచా రం చేయవద్దన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో నిధులు మంజూరయ్యాయని, త్వరలో ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నదన్నారు. కౌన్సిలర్లు అజయ్, నర్సింగ్, స్వామి, బండారు సతీశ్ పాల్గొన్నారు.