
తేజాపూర్‌లో మహాపడిపూజ
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దీక్షాపరులు, భక్తులు
నేరడిగొండ, జనవరి 2 : స్వామియే శరణం అయ్యప్ప నామ స్మరణతో మండలంలోని తేజాపూర్ గ్రామం మార్మోగింది. శనివారం రాత్రి గ్రామంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని గ్రామస్తులు, అయ్యప్పసేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నారికేళ గురుస్వామి ఏనుగు రవీందర్‌రెడ్డి పడిపూజ కార్యక్రమానికి బోథ్, నేరడిగొండ, కౌఠ, ఇచ్చోడ, పిప్పిరి, అడిగామ, బోరిగాం, పొచ్చెర, ధన్నూర్, వడూర్, బుగ్గారం,నిర్మల్ తదితర గ్రామాల నుంచి అయ్యప్ప దీక్షాపరులు, భక్తులు భారీగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రముఖ వేద పండితుడు మేఘరాజ్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. గురుస్వామి బద్దం ప్రభాకర్‌రెడ్డి భజన కార్యక్రమం అలరించింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. కడ్తాల్ ఆలయ ధర్మకర్త నర్సారెడ్డి హరిహరక్షేత్రం గురుస్వామి మూర్తి, అఖిల భారతీయ అయ్యప్పసేవా సమితి రాష్ట్ర కార్యదర్శి విఘ్నేశ్, దీక్షాపరులు పాల్గొన్నారు.