
బోథ్, నవంబర్ 1: మండలంలోని సొనాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం సోలార్ లాంతర్లను ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సీ సదానందం పంపిణీ చేశారు. 9,10వ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ తరఫున ప్రభుత్వం వీటిని ఉచితంగా సరఫరా చేసిందని తెలిపారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యాబోధనకు ఇబ్బందులు కలుగుతున్న విషయాన్ని విద్యార్థులు ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. డీఈవోతో మాట్లాడి ఉపాధ్యాయుడిని నియమించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో సీహెచ్ రాధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 1: పట్టణంలోని గెజిటెడ్ ఉన్నత పాఠశాల-1లో సోమవారం 248 మంది విద్యార్థులకు హెచ్ఎం నీలాదేవి సోలార్లైట్లు పంపిణీ చేశారు. విద్యుత్ లేని సమయంలో కూడా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సోలార్లైట్లు పంపిణీ చేసిందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నంద, మీనాక్షి, దీపక్, ప్రశాంత్, యాదగిరి, రమేశ్ పాల్గొన్నారు.
సిరికొండ, నవంబర్ 1: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 115 సోలార్ లైట్లను విద్యార్థులకు పాఠశాల చైర్మన్ దత్తు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం రాధాకృష్ణ, మాజీ సర్పంచ్ పెంటన్న, ఉపాధ్యాయులు కాంతయ్య, నవనీత్, భాస్కర్, వేణుగోపాల్, భిక్షపతి, సీతారాం పాల్గొన్నారు.
బేల, నవంబర్ 1 : సాంగిడి ఉన్నత పాఠశాల విద్యార్థులకు యువజన సంఘం నాయకుడు మహేందర్ సోలార్ లైట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సల్లూరి రాజు, వీడీసీ చైర్మన్ రావుత్ శ్రీనివాస్, రైతుబంధు సమితి గ్రామ కమిటీ అధ్యక్షుడు నితిన్, హెచ్ఎం శంషోద్దీన్, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.