
డీఈవో ప్రణీత గుడిహత్నూర్లో ప్రభుత్వ పాఠశాల తనిఖీ
గుడిహత్నూర్, ఫిబ్రవరి 1 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని డీఈవో ప్రణీత ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఐసొలేషన్ గది, శానిటైజేషన్, విద్యార్థులు భౌతికదూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట వారిని పంపాలని ఎంఈవో నారాయణకు సూచించారు. ఆమె వెంట జిల్లా సెక్టోరియల్ అధికారి కంటె నర్సయ్య ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 1 : లక్కారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈవో ప్రణీత తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరుశాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యాముల్, ఉపాధ్యాయులు రాజారాం, రాజన్న ఉన్నారు.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 1 : విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని డీఈవో ప్రణీత ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా సెక్టోరియల్ అధికారులు నర్సయ్య, నారాయణ, ఏఎస్వో మహేందర్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్సింగ్తీలావత్, ఉపాధ్యాయులు ఉన్నారు.
పాఠశాలలకు 60 శాతం హాజరు
భీంపూర్, ఫిబ్రవరి 1 : ప్రభుత్వం మంగళవారం నుంచి పాఠశాలలు పున : ప్రారంభించగా విద్యార్థుల నుంచి స్పందన కనిపించింది. మండలంలోని ఉన్నత, యూపీఎస్, ప్రాథమిక పాఠశాలలకు తొలిరోజు 60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అంతర్గాం, కరంజి(టీ) పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్, మన్నె ఎలియా తెలిపారు.