
జిల్లా ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి
కుప్టి జీపీలో లబ్ధిదారుల ఎంపికకు సర్వే
కుభీర్, ఫిబ్రవరి 1 : దళితుల సాధికారత కోస మే దళిత బంధు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా దళిత బంధు ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుప్టి జీపీని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. 35 మంది దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింప జేసే ప్రక్రియను మంగళవారం ఆయన స్థానిక సర్పంచ్ గాడేకర్ గంగాబాయితో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి ఈ పథకాన్ని క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి కమిటీలను సైతం ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి పర్చడమే పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వర్ని, కుప్టి గ్రామాల్లోని పలువురు దళితులను కమిటీలో చేర్చారు. దరఖా స్తు ఫారాలను అందించారు. సర్వే చేపట్టి 35 మం ది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఆయన వివరించారు. అధికారి మనోజ్, ఎంపీడీవో రమే శ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, పంచాయతీ కార్యదర్శి నరేశ్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గాడేకర్ రమేశ్, ఉప సర్పంచ్ సాయి, మాజీ ఎంపీటీసీ బండి సుభాష్, దాసరి మల్లారెడ్డి, గోపాల్, ఎర్రన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాంజ్రిలో..
భైంసాటౌన్, ఫిబ్రవరి 1 : మండలంలోని మాంజ్రి గ్రామంలో మంగళవారం దళితబంధు పథకం అమలుకు సర్వే నిర్వహించారు. అధికా రుల బృందం దళితుల జీవన స్థితిగతులు, ఇతర అంశాలపై ఆరా తీశారు. ఉపాధి ఇతర అంశాలు అడిగి తెలుసుకున్నారు. బైంసా మండల ప్రత్యేక అధికారి అశోక్ కుమార్, ఎంపీడీవో గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.