
నార్నూర్, ఫిబ్రవరి 1 : ప్రజా సంక్షేమం, అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. మండలంలోని ఎంపల్లిలో రూ.70 లక్షల తో చేపడుతున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఎంపల్లి ఆర్అండ్బీ ప్రధాన రహదారి నుంచి గ్రామ సమీపం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమ లు చేస్తూనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. మార్చి వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని సమగ్ర గిరిజన సంక్షే మ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం గ్రామంలో కమ్యూనిటీ భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూ రు చేయాలని స్థానికులు వినతిపత్రం అందజే శారు. అంతకు ముందు నార్నూర్‌లోని సాయి గోసేవా ట్రస్ట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు శాలువాతో సన్మా నించారు. సర్పంచ్ రాథోడ్ గోవింద్‌నాయక్, ఎంపీపీ కనక మోతు బాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఐటీడీఏ డీఈ శివప్రసాద్, ఏఈ సునీల్, ఉప సర్పంచ్ మడావి పైకు, కనక ప్రభాకర్, శ్రీరామ్, మెస్రం మానిక్రావ్, దాదిరావ్, తదితరులు పాల్గొన్నారు.