
మావల జడ్పీటీసీ వనిత
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 1: పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి వరంలాంటిదని మావల జడ్పీటీసీ వనిత పేర్కొన్నారు. మండలంలోని బట్టిసావర్గం గ్రామంలో మంగళవారం ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు రాగం గంగవ్వ, దొగ్గలి ప్రమీల, ఉపసర్పంచ్ మహేందర్ యాదవ్, నాయకులు రాజేశ్వర్, రాగం గోవర్ధన్, సంతోష్, గంగన్న, రాజు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జైనథ్, ఫిబ్రవరి 1 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ గోవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని గిమ్మ గ్రామంలో మంగళవారం నలుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.