
ఎమ్మెల్యే దివాకర్‌రావు
సీసీసీలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలు
సీసీసీ నస్పూర్, ఫిబ్రవరి 1: క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల్ భవిష్యత్ ఉంటుందని, యువత క్రీడలపై మక్కువ చూపించాలని ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. సీసీసీ సింగరేణి మినీ గ్రౌండ్లో అంజనీపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. సీసీసీ జట్టుపై మంచిర్యాల విశ్వక్ జట్టు విజయం సాధించింది. వీరికి ఎమ్మెల్యే దివాకర్‌రావు మెడల్స్, షీల్డ్‌లు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర నాయకులు అన్నయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బండి పద్మ, జబీన్హైమద్, నాయకులు గర్శె రామస్వామి, జక్కుల కుమార్, మోతె కనుకయ్య, పత్తి వెంకటేశ్, వెంగల కుమారస్వామి, నీలం సదయ్య, కాటం రాజు, చెల్ల విక్రం, గోపాల్‌రెడ్డి, రవిగౌడ్, జాడి భానుచందర్, అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఆర్గనైజర్స్ లడ్డ సాయి, సంతోశ్, జాన్సన్, వెంకటసాయి, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం లక్షెట్టిపేట లక్షెట్టిపేట మండలంలోని మండలంలోని బలరావుపేటలో పవన్ శ్రీ స్మారక ఓపెన్ కబడ్డీ పోటీలను నిర్వహించారు. కొత్త కొమ్ముగూడెం (గంగన్న) జట్టు విజేతగా, కన్నెపల్లి(అలెక్షా), ఆర్యన్ పటేల్( మహాదేవ్) జట్లు ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచాయి. వీరికి నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, టీఆర్ఎస్ యువనేత, ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ రావు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మెన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, పవన్ శ్రీ కుటుంబ సభ్యులు వెల్తపు శ్రీనివాస్, సర్పంచ్‌లు వెల్తపు సునీత, బండి సత్తన్న, ఉప సర్పంచ్‌లు కోన శ్రీనివాస్, దొమ్మటి కమలాకర్, నాయకులు గడ్డం వికాస్, కోన కిరణ్, తోట సాగర్, వార్డు సభ్యులు మండె చంటి, పీఏసీఎస్ డైరెక్టర్ వెల్తపు శ్రీఖర్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొట్టే ఓదేశ్, ఆర్గనైజర్లు చందు, మధుసూదన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నీ ప్రారంభం
తాండూర్, ఫిబ్రవరి 1 : బోయపల్లిలో పుర్ర ప్రశాంత స్మారకంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ టోర్నీని మంగళవారం సర్పంచ్ భీమ సునీత, ఎంపీటీసీ, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు మాసాడి తిరుపతి, ఉప సర్పంచ్ రౌతు వెంకటేశం, ప్రశాంత్ తల్లిదండ్రులు సూరమ్మ పోశం, స్నేహితులు, నాయకులు, యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.