
బెల్లంపల్లిరూరల్, ఫిబ్రవరి 1: ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై దృష్టి సారించాలని పోలీసులను బెల్లంపల్లి ఏసీసీ ఎడ్ల మహేశ్ ఆదేశించారు. మంగళవారం బెల్లంపల్లిరూరల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులకు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సును నిర్వహించారు. గంజా సాగు, సరఫరా, విక్రయం, సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. లాడ్జీలు, బస్టాండ్లు, కళాశాలలు, రోజుకూలీల అడ్డాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని సూచించారు. ఈ సదస్సులో బెల్లంపల్లిరూరల్, తాండూర్, మందమర్రి, బెల్లంపల్లివన్టౌన్ సీఐలు కే జగదీశ్, కే బాబూరావు, ఎస్. ప్రమోద్‌రావు, ఎం రాజు బెల్లంపల్లి సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో..
జైపూర్, ఫిబ్రవరి 1: గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై జైపూర్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏసీపీ నరేందర్ సబ్ డివిజన్ పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ గంజాయిని నియంత్రించేందుకు పోలీసులు నిఘా పెంచాలని తెలిపారు. ప్రతి గ్రామ పోలీస్ అధికారి వారికి కేటాయించిన ప్రాంతాలపై నిఘా ఉంచాలని తెలిఆరు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ రాజు, జైపూర్, శ్రీరాంపూర్, భీమారం ఎస్ఐలు రామకృష్ణ, మానస, అశోక్, ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
దండేపల్లి మండలంలో..
దండేపల్లి, ఫిబ్రవరి1:మత్తు పదార్థాలు అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సాంబమూర్తి అన్నారు. దండేపల్లి మండలంలోని తానిమడుగు జీపీ పరిధిలోని బెహ్రూన్గూడలో గిరిజనులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రేమళ, ఎక్సైజ్ ఎస్ఐ రాబర్ట్, గ్రామ పటేల్ పెంద్రం రాంపటేల్ ఉన్నారు.
జన్నారం మండలంలో..
జన్నారం, ఫిబ్రవరి 1 : మత్తుపదార్థలను సేవించడం, గంజాయి మొక్కలను పెంచడం నేరమని ప్రతి ఒక్కరూ వాటికి దూరంగా ఉండాలని లక్షెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్ సూచించారు. మండలంలోని మురిమడుగులో మత్తు పదార్థాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కా ర్యక్రమంలో ఎస్ఐ సతీశ్, సర్పంచ్ ఐ భాగ్యలక్ష్మి, రాజలింగు, ఎంటీసీ సభ్యురాలు భూమక్క,జగదీశ్వర్, యాదగిరి అభిలాష్‌రావు, వెంకటేశ్ గ్రామ స్తులు పాల్గొన్నారు.