
దిలావర్పూర్/ ఇంద్రవెల్లి, జనవరి 1 : నూతన సంవత్సరం వేళ ఆలయాలు భక్తులతో కిక్కిరిశా యి. దిలావర్పూర్ మండలంలోని ప్రసిద్ధ, ప్రాచీ న దేవాలయాలైన శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహస్వామి, కదిలి పాపహరేశ్వర సన్నిధికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నృ సింహుని ఆలయం వద్ద ఉన్న కోనేరులో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, దాతల సహకారంతో అన్నదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్లు చిన్నయ్య, భుజంగ్రావు, ఈవో సదయ్య, కమిటీ అధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
నాగోబా సన్నిధిలో ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నాగో బా ఆలయ స్తంభాలపై చెక్కిన దేవతల చిత్రాలను కొంతమంది భక్తులు ఫోన్లో బంధించారు.
బాసరకు భక్తుల తాకిడి
బాసర, జనవరి 1 : బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధికి శనివారం భక్తుల తాకిడి నెలకొంది. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుం చి సైతం భక్తులు తరలివచ్చారు. భక్తులు తమ చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
శివాలయంలో ఎమ్మెల్యే పూజలు
నేరడిగొండ, జనవరి 1: నేరడిగొండ మండలంలోని కుమారి శివాలయంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దంపతులు పూజలు నిర్వహించారు. వేద పండితుడు శ్రావణ్కుమార్శర్మ వేదమంత్రాలు చదువగా ఎమ్మెల్యే దంపతులు శివలింగానికి అభిషేకాలు చేశారు. పట్పట్తండాలో ని జగదాంబదేవి ఆలయంలో పూజలు చేశారు.
కనుల పండువగా ఉత్సవాలు
లక్ష్మణచాంద, జనవరి 1 : మండలంలోని రాచాపూర్ గ్రామంలో ఇటీవల నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డప్పువాయిద్యాలతో మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్ర తీశారు. కాగా.. మండలంలోని లక్ష్మణచాంద అష్టభుజ వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ఈటెల శ్రీనివాస్ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.