
ఇటీవల లింగాపూర్, సావర్‌ఖేడ్, మంగికి ‘పల్లెవెలుగు’
ఆదాయం అంతగా లేకున్నా.. ప్రజలు, విద్యార్థుల సౌకర్యార్థం సేవలు
నెరవేరిన దశాబ్దాల కల సర్వత్రా హర్షం
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి1 (నమస్తే తెలంగాణ) : ఆటోలు, ఇతర వాహనాల హారన్ శబ్దాలు తప్ప, బస్సులు ఎరగని ఆ పల్లెలకు నేడు ‘ప్రగతి రథం’ పరుగులు తీస్తున్నది. ఇటీవల లింగాపూర్, సావర్‌ఖేడ్, మంగి గ్రామాలకు ‘పల్లె వెలుగు’ ప్రారంభించగా, ప్రజలు, విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నది. ఆదాయం అంతగా లేకున్నా మారుమూల ప్రాంతాలకు సర్వీసు సేవలందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దశాబ్దాల కల నెరవేర్చిన ఆర్టీసీకి రుణపడి ఉంటామన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
జిల్లాలోని మారుమూల పల్లెలకు ఆర్టీసీ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఆ యా ప్రాంతాల ప్రజలు, విద్యార్థుల సౌకర్యా ర్థం ఆర్టీసీ అధికారులు సేవలు ప్రారంభించా రు. లింగాపూర్ మండల కేంద్రం అయినప్పటికీ ఇప్పటి దాకా బస్సు సౌకర్యం లేదు. మం డలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో జైనూర్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. 20 రోజుల క్రితం ఆర్టీసీ పల్లె బస్సును ప్రారంభించడంతో ఆ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 65 కిలోమీటర్ల దూరంలోనున్న లింగాపూర్‌కు రోజుకు రెండు ట్రిప్పులు (ఉదయం, మధ్యాహ్నం) నడిపిస్తున్నారు. ఈ రూట్లో ప్రతిరోజూ రూ. 4 వేలకు మించి ఆదాయం రావడం లేదు. అయినప్పటికీ ప్రజలు, విద్యార్థుల సౌకర్యం కోసం ఈ బస్సుని నడిపిస్తున్నారు.
సావర్ఖేడ్కు కొత్తగా..
జిల్లా కేంద్రం నుంచి కెరమెరి మండలం సావర్‌ఖేడ్ గ్రామం కేవలం 28 కిలో మీటర్ల దూ రంలో ఉంటుంది. ఈ మారుమూల గ్రామానికి ఇప్పటివరకూ బస్సు వసతి లేదు. ప్రైవేట్ వాహనాల ద్వారా ప్రజలు రాకపోకలు సాగించారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఇటీవల ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ప్రతి రోజూ ఈ రూట్లో మూడు ట్రిప్పులు నడిపిస్తుండగా, రూ. 6 వేల వరకు ఆదాయం వస్తుంది.
26 ఏండ్ల తర్వాత మంగి గ్రామానికి..
ఆసిఫాబాద్ నుంచి తిర్యాణి మండలంలోని మారుమూల గ్రామం మంగి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి 1995 వరకు ఆర్టీసీ బస్సును నడిపించా రు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడం, రోడ్లు అధ్వానంగా ఉండడంతో ఆర్టీసీ బస్సును నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతూ వచ్చారు. తిర్యాణి నుంచి ఆసిఫాబా ద్ జిల్లా కేంద్రానికి అనేక మంది విద్యార్థులు, ప్రజలు నిత్యం వచ్చి వెళ్తుంటారు. ఇటీవల పో లీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా తిర్యాణి ఎస్ఐ రామారావు ప్రత్యేక చొరవతో తీసుకొని మట్టి రోడ్డు వేయించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బస్సు సర్వీసును ప్రా రంభింపజేశారు. 26 ఏండ్ల తర్వాత బస్సు రా వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రూట్లో ప్రతి రోజూ రెండు ట్రి ప్పులు నడిపిస్తుండగా, రూ. 7 వేల వరకు ఆదాయం వ స్తుందని అధికారులు చెబుతున్నారు.