డీజీపీ ఎం మహేందర్ రెడ్డి
వర్టికల్స్ ఇన్చార్జి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
ఎదులాపురం, సెప్టెంబర్ 1 : జిల్లా ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసు అధికారులు సేవలు అందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వర్టికల్స్ ఇన్చార్జి అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. వర్టికల్ విధానంలో కేటాయించిన విధుల్లో సాధించిన ప్రగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో 13 వర్టికల్స్ విభాగాల్లో ప్రతిభ చూపుతున్నట్లు డీజీపీకి వివరించారు. ప్రధానంగా రిసెప్షన్, స్టేషన్‌రైటర్, పెట్రోలింగ్, కోర్టు డ్యూటీ, వారెంట్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తదితర వాటిల్లో ప్రతిభ చూపుతున్నారని వెల్లడించారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించే విధులకు కావాల్సిన సామర్థ్యాలు, నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని వర్టికల్స్ విభాగంలో పనిచేస్తున్నారన్నారు. అవసరమైన సాంకేతిక సాధనాలు, అవలంభించాల్సిన పద్దులు మెరుగుపర్చుకోవాల్సిన వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని తెలిపారు. ప్రతీ అంశం ఆన్లైన్లో పొందుపర్చి నాణ్యతా ప్రమానాలు పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్టికల్ ఇన్చార్జి అధికారులు పోతారం శ్రీనివాస్, కే పురుషోత్తంచారి, ఈ చంద్రమౌలి, జే కృష్ణమూర్తి, కే ప్రేమ్ కుమార్, డీసీఆర్బీ ఎస్ఐ ఎంఏ హకీం, ఐటీ కోర్ ఇన్చార్జి సింగజ్‌వార్ సంజీవ్ కుమార్, ఎంఏ రియాజ్, కే నరేందర్, మహ్మద్ మురాద్ తదితరులు పాల్గొన్నారు.