జిల్లాలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు
మొదటిరోజు అంతంతమాత్రంగానే విద్యార్థుల హాజరు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అనుమతి
బడులను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్, అధికారులు
కాగజ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 1: జిల్లావ్యాప్తంగా బుధవారం విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు పాఠశాలలను శుభ్రం చేసి, తోరణాలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. పాఠశాలల ప్రాంగణం విద్యార్థులకు నూతన అనుభూతిని కలిగేలా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు సైతం స్కూళ్ల ప్రారంభంపై సుముఖంగా ఉండడంతో విద్యార్థులు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బడికి హాజరయ్యారు. ఆవరణలో ప్రార్థనలు చేసిన అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా కూర్చోబెట్టారు. ఇదిలాఉంటే కలెక్టర్ రాహుల్‌రాజ్, అధికారులు, ఎంఈవోలు పాఠశాలలను సందర్శించారు.పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునఃప్రారంభించడంతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాస్కు ధరించి వచ్చారు.
పరిశుభ్రంగా ఉంచాలి : కలెక్టర్
కాగజ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 1: బడులను శు భ్రంగా ఉంచాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జడ్పీఎస్ఎస్ బాలికల, బాలుర పాఠశాలలను బుధవారం సం దర్శించారు. ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, నిలిచిన నీరు, ఏపుగా పెరిగిన చెట్లను తొలగించి, విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని సూ చించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. తహసీల్దార్ ప్రమోద్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, ఎంఈవో భిక్షపతి, అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
జడ్పీ పాఠశాల తనిఖీ ..
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 1 : మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. నిల్వ బియ్యాన్ని మార్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థుల హాజరుశాతం పెరిగేలా కృషి చేయాలన్నారు. వి ద్యార్థులకు కొవిడ్ నిబంధనలు వివరించి, నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ నదీముల్లాఖాన్, ఎంఈవో సో మయ్య, జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు అబ్దుల్ అజీర్, సీఆర్పీ పవన్, ఉపాధ్యాయులు ఉన్నారు.
దహెగాం,సెప్టెంబర్ 1: మండలంలో 57 పాఠశాలలు ఉండగా, అందులో 3816 మంది విద్యార్థు లు ఉన్నారు. బుధవారం 3,614 మంది విద్యార్థులు హాజరయ్యారు. అదేవిధంగా అంగన్వాడీ కేం ద్రాలు కూడా తెరుచుకున్నాయి. చిన్నరాస్పల్లి, దహెగాం గ్రామాల్లో కేంద్రాల ప్రారంభానికి ఎంపీపీ కంభగౌని సులోచన హాజరయ్యారు. అదేవిధంగా రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంభగౌని సంతోష్‌గౌడ్, ఎంపీటీసీ రాపర్తి జయలక్ష్మి, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ రాపర్తి ధనుంజయ్, సర్పంచ్ తుమ్మిడ అమృత, ఉపాధ్యాయు లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
బెజ్జూర్, సెప్టెంబర్ 1 మొదటిరోజు తలిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా జడ్పీ ఉన్నత పాఠశాలలో మొదటి రోజు ఆరుగురు విద్యార్థులు హాజరైనట్లు హెచ్ఎం రవికుమార్ తెలిపారు.
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 1 : రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరచుకున్నాయి. మొద టి రోజు కావడంతో చాలా తక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు.
పెంచికల్పేట్ , సెప్టెంబర్ 1 : మండలకేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 227 మంది విద్యార్థులకు 17 మంది హాజరైనట్లు ప్రధానోపాధ్యాయుడు యాదగిరి తెలిపారు. మొదటి రోజు కావడంతో పాఠశాలలకు విద్యార్థుల తాకిడి స్వల్పంగా ఉంది.
కౌటాల, సెప్టెంబర్ 1 : మొదటి రో జు విద్యార్థులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు.
చింతలమానేపల్లి , సెప్టెంబర్ 1 : మండలంలోని రవీంద్రనగర్-1 పాఠశాలతో పాటు ఆయా గ్రా మాల్లోని పాఠశాలలకు విద్యార్థులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించారు.
రెబ్బెన, సెప్టెంబర్ 1: మండలంలోని పలు పాఠశాలలను ఎంఈవో వెంకటేశ్వరస్వామి సందర్శించారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించేలా చూడాలన్నారు.
రెబ్బెన, సెప్టెంబర్ 1: మండలంలోని పలు పాఠశాలలను ఎంఈవో వెంకటేశ్వరస్వామి సందర్శించారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించేలా చూడాలన్నారు.
కెరమెరి, ఆగస్టు 1: మండలంలో పాఠశాలలను శుభ్రం చేసి, తోరణాలు, బెలూన్లతో అందంగా అలంకరించారు. విద్యార్థులు కొవిడ్-19 నియమాలు పాటిస్తూ బడికి హాజరయ్యారు.
జైనూర్, సెప్టెంబర్ 1: జైనూర్, సిర్పూర్-(యూ) మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పా ఠశాలలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా రో జులుగా చదువుకు దూరంగా ఉన్న విద్యార్థులు పా ఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఉత్సాహంగా బడిబాట పట్టారు.
లింగాపూర్, సెప్టెంబర్ 1: మండలంలో ఆశ్రమ పాఠశాలలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు మినహ అన్ని పాఠశాలను ప్రారంభించామని ఎంఈవో కుడ్మెత సుధాకర్ పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల పరిశీలన..
తిర్యాణి, సెప్టెంబర్ 1: మండలంలోని గిన్నేధరి, పెర్కపల్లి, తిర్యాణి, విజయనగరం, సాలెగూడ, సుంగాపూర్, ఎస్సీకాలనీ తదితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను (ఐసీడీఎస్ పీడీ)జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి సావిత్రి బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఇప్పటినుంచి గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలందరూ కేంద్రాల్లోనే మధ్యాహ్న భో జనం చేసేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట సూపర్వైజర్ సోంబాయి, అం గన్వాడీ టీచర్ మమత, తదితరులు ఉన్నారు.
తిర్యాణి, సెప్టెంబర్ 1 : మండలకేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం 176 మం దికి 38 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు మాస్కు ధరిస్తేనే అనుమతిస్తున్నామని జడ్పీ పాఠశాల హెచ్ఎం షెడ్మాకి రాము తెలిపారు.