
ఆదిలాబాద్ రూరల్/భైంసా, జనవరి 31: సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి 24 రోజుల తర్వాత అన్ని విద్యాసంస్థలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాఠశాలలను హెచ్ఎంలు, ఉపాధ్యాయులు శుభ్రం చే యించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది పాఠశాలలను శుభ్రం చేయడంతో పాటు సోడి యం హైపోక్లోరైట్ను పిచికారీ చేశారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా పాఠశాలల పనివేళల సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేశారు. హాస్టళ్లను కూడా ప్రారంభించనుండడంతో విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పది,ఇంటర్ పరీక్షలు సమీ పి స్తుం డడంతో విద్యార్థులకు వీలైనంత త్వరగా సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలు నిర్వహించనున్నారు.
నిబంధనలు పాటించాలి..
విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు, వాటర్ బాటిళ్లు వెంట తెచ్చుకోవాలని వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడానికి థర్మల్స్కానర్లను అందుబాటులో ఉంచుకుంటున్నారు. తరగతి గదుల్లో బెంచీకి ఒకరిని మాత్రమే కూర్చోబెట్టనున్నారు. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
నిబంధనలు పాటించాలి
నిర్మల్ అర్బన్/సోన్, జనవరి 31 : అన్ని విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి సూచించారు. నిర్మల్, సోన్ కేజీబీవీలు, కడ్తాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్లో ఉంచి పరీక్షలు చేయించాలన్నారు. కార్యక్రమంలో ఎస్వోలు సుజాత, లత, హెచ్ఎం మహేందర్, ఉపాధ్యాయులు ఉన్నారు.