
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
కొద్దుగూడలో ఎస్టీ భవనం ప్రారంభం
గుడిహత్నూర్, జనవరి 31 : ఐక్యతతోనే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని బోథ్ ఎమ్మె ల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండలంలోని కొద్దుగూడలో రూ.2 లక్షల 50 వేలతో నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రా మ ప్రముఖులు శాలువా కప్పి సన్మానించా రు. ఎంపీటీసీలు కేంద్రే న్యాణు, షగీర్‌ఖాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ రా థోడ్ ప్రతాప్, జిల్లా, మండల నాయకులు జాదవ్ రమేశ్, జలందర్, ఆడె గుణవంత్‌రావ్, సోనేరావ్, శ్యాంరావ్, పాటిల్ రాం దాస్, సోయం సతీశ్, నీల్‌కంఠ అప్పా, డీకే సంజయ్, రావణ్ ముండె, ససానే సిద్ధార్థ్, ఫడ్ దిలీప్, భీంరావ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
సిరికొండ, జనవరి 31: జిల్లాకేంద్రంలోని తన నివాసంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బా పురావ్ మండలానికి చెందిన జాదవ్ పద్మకు, సీఎంఆర్ఎఫ్ కింద రూ.14వేలు మంజూరు, కాగా చెక్కును అందజేశారు. సిరికొండ టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ బాలాజీ, మండల నాయకులు ఉన్నారు.
గంగాపూర్‌కు చెందిన..
బజార్హత్నూర్ జనవరి31: మండలంలోని గంగాపూర్‌కు చెందిన ముర్కుటే రామారావ్‌కు, సీఎంఆర్ఎఫ్ కింద రూ.60వేలు మంజూరు కాగా, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆదిలాబాద్‌లోని తన స్వగృహం లో లబ్ధిదారుడికి సోమవారం చెక్కును అం దజేశారు. ఆపదలో అదుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉం టానాని బాధితుడు పేర్కొన్నారు.