
రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సారంగాపూర్‌లో 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం
సారంగాపూర్, జనవరి 31: తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో రూ. 20కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబీమా పథకం, పంట పెట్టుబడి సాయం, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు రైతువేదికలు నిర్మించి సీఎం కేసీఆర్ రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మల్ నియోజకవర్గంలో 50కి పైగా, సారంగాపూర్ మండలంలో 9 సబ్స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. స్వర్ణ వాగుపై 9 చెక్‌డ్యాంలను నిర్మించడం వల్ల భూగర్భజలాలు పెరిగాయని, దీని మూలం గా మత్స్యకారులు, రజకులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉందన్నారు.
చెక్కుల పంపిణీ..
మండలంలోని వివిధ గోండు గ్రామాలకు చెందిన వారు దీపావళి పండుగ సందర్భం గా గుస్సాడీ నృత్యాలు ప్రదర్శించిన విష యం తెలిసిందే. అయితే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఒక్కొక్క గ్రూపునకు రూ. 10వేల చొప్పున ఐదు గ్రూపులకు మొత్తం రూ. 50 వేల విలువైన చెక్కులను అందజేశారు. సబ్‌స్టేషన్ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజ్‌మహ్మద్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్‌కో డైరెక్టర్ జగపతిరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, సర్పంచ్ సుజాత, మండల టీఆర్ఎస్ ఇన్చార్జి అల్లోల మురళీధర్‌రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు చౌహాన్, గణపతిరావు, రాజేశ్వర్, రంగస్వామి, మధుసూదన్, త్రినాథ్‌కుమార్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఎంపీడీవో సరోజ, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, ఆ యా శాఖల అధికారులు పాల్గొన్నారు.