
ఆదిలాబాద్ రూరల్, జనవరి 31: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జోగు రామన్నను రాష్ట్ర డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో రుయ్యాడి సర్పంచ్ పోతారెడ్డి, నాయకులు గోక భూమారెడ్డి, భూమన్న, ప్రవీణ్ రెడ్డి, రాకేశ్, ప్రకాశ్ రెడ్డి, ఉత్తమ్ పాల్గొన్నారు.
ఎదులాపురం, జనవరి 31 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్యే జోగు రామన్నను మాల సంక్షేమ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ జిల్లాలో మాలలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి తనుముందు ఉంటానని హామీ ఇచ్చారు. దళిత బంధు పథకంలో జిల్లాలోని పేదలైన దళితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన అడ్డి భోజారెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అల్లూరి భూమన్న, ప్రధాన కార్యదర్శి దాసరి బాబన్న, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుకర్, నాయకులు, భగవాండ్లు, దేవన్న, భాస్కర్, రాజేశ్వర్, సాయిబాబా, స్వామి పాల్గొన్నారు.
ఉట్నూర్, జనవరి 31 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన జోగు రామన్నను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్‌రావ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాంనాయక్, నాయకులు రాజేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.