ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
30వ వార్డులో పర్యటన
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 12 : పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 30వ వార్డు ఖానాపూర్‌లో శనివారం ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 49 వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పాటుపడుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద నిధులు మంజూరు చేయడంతో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అజయ్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి
యువతలో పోటీతత్వం పెరగాలంటే క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ రాణించాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. ఆదిలాబాద్‌లోని డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జోగు ఆశన్న మెమోరియల్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కాసేపు మున్సిపల్ చైర్మన్ బౌలింగ్ వేయగా ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడారంగంలో రాణించే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, యూనిస్ అక్బానీ, ఆనంద్ పాల్గొన్నారు.