ఎదులాపురం, ఫిబ్రవరి 21 : ఈ నెల 23న అధికారికంగా జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదా నంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహ రాజ్ జయంతి వేడుకలకు బంజారా, లంబాడా కులస్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ పిలుపునిచ్చారు. సంత్ సేవాలాల్ మహరాజ్ 283వ జయంతి వేడుకల కరపత్రలను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి సోమవారం జడ్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడు తూ అన్ని వర్గాల పండులను సీఎం కేసీఆర్ అధి కారికంగా జరుపుకునేందుకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనం తరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లా డుతూ సంత్ సేవాలాల్ జయంతిని ఘనం గా జరుపుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథో డ్ రామారావు, గౌరవ అధ్యక్షుడు జాదవ్ రమేశ్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ పవార్, ప్రధాన కార్యదర్శి జాదవ్ బలిరాం, సలహాదారులు రూపావత్ అమర్ సింగ్, జావన్ వినా యక్రావు, రాథోడ్ హరాలాల్ నాయక్, రాథోడ్ సురేశ్ నాయ క్, కోశాధికారి సుభాష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.