నిర్మల్ అర్బన్, ఆగస్టు 31 : పట్టణంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాలనీ కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్ర మా న్ని నిర్వహించారు. చిన్నారులు గోపిక, కృష్ణుని వేషధారణతో ఆకట్టుకున్నారు. ఉట్టిని పగులగొట్టి న వారికి బహుమతులను అందజేశారు. కాలనీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, సభ్యులు దాయాత్రి కిశోర్, సంగారి శ్రీనివాస్, సామల వీరయ్య, గోవ ర్ధన్, భోజన్న, దేవేందర్, నాలం మదన్ మోహన్, సురేశ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
ముథోల్‌లో..
ముథోల్, ఆగస్టు 31 : మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. శ్రీకృష్ణుని, గోపిక వేషధారణలో చిన్నారు లు అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం జరిపారు. ధర్మపురి సుదర్శన్, పాఠశాల సమితి ఉపాధ్యక్షుడు కొండావావర్ సంజీవ్, కార్యదర్శి కంది మానాజీ, సహ కార్య దర్శి నిశికాంత్, దర్బార్ నరేశ్, హితైషుల మీరా బాయి, లక్ష్మీకాంత పట్వారి, ప్రధానా చార్యులు సారథి రాజు పాల్గొన్నారు.
భైంసాలో..
భైంసా, ఆగస్టు 31 : పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరిగల్లి ఆధ్వర్యంలో గణేశ్‌నగర్, కోర్భగల్లిలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. కాలనీ వాసులు తమ పిల్లలను శ్రీకృష్ణుడు, గోపి కల వేషధారణతో ఉట్టి కొట్టారు. హెచ్ఎం గంగా ధర్, శ్రీధర్, సుదర్శన్, తదితరులు ఉన్నారు.
దస్తురాబాద్‌లో..
దస్తురాబాద్, ఆగస్టు 31 : మండల కేంద్రం లోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అర్చకు లు నరేశ్ చార్యులు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు పలు ఆలయా లు, తమ తమ ఇండ్లల్లో ప్రత్యేక పూజలు చేశారు. రేవోజిపేటతోపాటు, పలు గ్రామాల్లో గ్రామ పెద్ద లు యువకులు ఉట్లను కొట్టారు. గోపిక, కృష్ణుడి వేషధారణలు ఆకట్టుకున్నాయి.
తానూర్‌లో..
తానూర్, ఆగస్టు 31 : మండలంలోని ఆయా గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. దహాగాం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వ హించారు. ఉట్టిని కొట్టారు.
కుంటాలలో..
కుంటాల, ఆగస్టు 31 : మండల కేంద్రంలో వారం రోజులుగా కొనసాగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు మంగళవారం ముగిశాయి. కృష్ణ మంది రంలో ప్రత్యేక పూజలు చేసి పల్లకీ సేవ నిర్వహిం చారు. దారి పొడవునా భక్తులు కృష్ణ భగవానుడిని దర్శించుకున్నారు. హనుమాన్ మందిరంలో వేడు కలు నిర్వహించారు. పాత బస్టాండ్‌లో ఉట్టి కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. భారీ వ ర్షం వల్ల జాతరకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు పడ్డారు. భక్తులకు సొసైటీ మాజీ చైర్మన్ జుట్టు లక్ష్మణ్ అన్నదానం చేశారు.
రూ.10వేల విరాళం
కుభీర్, ఆగస్టు 31 : మండల కేంద్రంలోని శ్రీకృష్ణ ఆలయానికి నిగ్వ గ్రామానికి చెందిన డాక్ట ర్ హృషికేశ్ జన్మాష్టమి వేడుకల్లో బాగంగా మైక్‌సెట్ కొనుగోలు కోసం ఆలయ కమిటీ సభ్యు లకు రూ.10వేల విరాళం అందజేశారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో అన్నదానం చేశారు. కాగా సింగిల్ విండో చైర్మన్ గంగాచరణ్, గంగాధర్ పటేల్, వైస్ ఎంపీపీ మొహియోద్దీన్, మార్కెట్ చైర్మన్ కందూరి సంతోష్, నాయకులు తూము రాజేశ్వర్, అనిల్, విజయ్‌కుమార్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.