
ఎదులాపురం, డిసెంబర్ 6 : ప్రజల భాగ స్వామ్యం, ప్రజాప్రతినిధులు సహకారంతో జిల్లా లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలా బాద్‌లోని సంజయ్‌నగర్, ఆదిత్యనగర్, మీడి యా కాలనీల్లో వ్యాక్సినేషన్ పంపిణీని సోమవా రం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒమిక్రాన్ వ్యాప్తి చెందక ముందే జిల్లాలోని అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసు కునేందుకు ముందుకు రావాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 82 శాతం మంది వ్యాక్సిన్ తీసు కున్నారని, మిగతా 18 శాతం మంది వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నా మని వివరించారు. వృద్ధులు వ్యాక్సినేషన్ తీసుకో వడానికి ముందుకు రావడం మంచి పరిణామ మన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ శైలజ, జిల్లా పౌర సంబం ధాల అధికారి ఎన్ భీం కుమార్, వార్డుల ప్రత్యేకా ధికారులు సునీత, కృష్ణవేణి, రాజలింగం, శ్రీనివా స్, మెప్మా సిబ్బంది భాగ్యలక్ష్మి, మెడికల్ టీంలు, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
ఒమ్రికాన్ వైరస్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమ త్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ పేర్కొన్నారు. నిర్మల్‌లోని బస్టాండ్, ఓల్డ్ బస్టాండు, మంచిర్యాల చౌరస్తా, తదితర వ్యాపా ర సముదాయాల్లో తనిఖీలు నిర్వహించా రు. ప్రజలకు వ్యాక్సిన్ వేయించారు. కలెక్టర్ కాలినడ కన పలు ప్రాంతాల్లో పర్యటించారు. హోటళ్లు, టీ స్టాల్స్, దుకాణాలు, పాన్ షాప్‌ల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారికి వేయించారు. రోడ్డుపై ఆటోలు, ఇతర వాహనాలను ఆపి వ్యాక్సిన్ వేయించారు. పాత బస్టాండ్ ప్రధాన కూడలి, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో అధికారులు ముమ్మరంగా తిరిగి వ్యాక్సిన్ వేయించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్టర్ బస్సు ఎక్కి ప్రయాణికుల నుంచి టీకా వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీకా వేసుకోని వారికి బస్సుల్లోనే ఇప్పించారు. జిల్లాలో 100 శాతం వ్యాక్సిన్ పూర్తి చేయడానికి అధికారులు శాయశక్తులా కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాదికారి ధన్‌రాజ్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మెప్మా పీడీ సుభాష్, డీఎం ఆంజనేయులు తదితరులున్నారు.
అర్హులు వ్యాక్సిన్ తీసుకోవాలి
అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాంబా బు సూచించారు. భైంసాలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ఆర్డీవో లోకేశ్వర్ రావు, మున్సిపల్ కమిషన్ అలీం, డా. మతీన్, హెల్త్ సూపర్ వైజర్ ఖలీం, తహసీల్దార్ విశ్వంబర్ ఉన్నారు.
ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలి
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు మా స్కు ధరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, నర్సాపూర్, తలమద్రి, మేడి గూడలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థులను పాఠాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాలలకు సంబంధించిన రికార్డు లు పరిశీలించారు. డీఈవో వెంట జిల్లా సెక్టోరియ ల్ అధికారి నర్సయ్య, మండల విద్యాధికారి రాథోడ్ ఉదయ్‌రావ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
బోథ్‌లో..
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సొనాల పీహెచ్సీ డాక్టర్ నవీన్‌రెడ్డి సూచించారు. మండలంలోని గుర్రాలతండా గ్రామంలో మిగిలిపోయిన వారికి ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేయించారు. 102 ఏళ్ల వృద్ధురా లికి టీకా ఇప్పించారు. బోథ్‌లో డిప్యూటీ తహసీ ల్దార్ రాథోడ్ ప్రకాశ్, సర్పంచ్ జీ సురేందర్ యాదవ్ ఇంటింటికీ తిరిగి టీకా వేయించారు. ఏఎన్ఎంలు అనసూయ, సుమంగళ, శశికళ, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కప్పర్లలో వందశాతం..
మండలంలో ని కప్పర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వందశాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉద యం నుంచి అదనపు డీఎంహెచ్‌వో శ్రీకాం త్, ఎంపీడీవో ఆకుల భూమయ్య, తహసీ ల్దార్ సంధ్యారాణి, ఎంపీవో సుధీర్‌రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ టీకా వేయించారు. కార్యక్రమంలో మండల వైద్యాధి కారి నర్మద, సర్పంచ్ సదానందం, ఏఎన్ఎంలు సునంద, లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ నగేశ్, ఆశ కార్య కర్తలు, అంగన్వాడీ టీచర్లు, తదితరు లు పాల్గొన్నారు.