బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగ శివప్రసాద్
రైతులకు అవగాహన సదస్సు
పెంబి, ఫిబ్రవరి 13 : ఎఫ్‌పీవో, ఎఫ్‌పీసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతు సంఘాలను బలోపేతం చేసేందుకు నాబ్ కిసాన్ ద్వారా రుణాలు అందజే యనున్నట్లు నాబ్‌కిసాన్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగ శివప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వెంకటసాయి రైతు సేవా సహాయ సహకార పరపతి పొదుపు సంఘం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వ హించారు. నాబ్‌కిసాన్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎన్సీడీఈఎక్స్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. రైతులు నేరుగా పంటలు అమ్ముకోవడం, ఆర్థికంగా ఎదగ డం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగ శివప్రసాద్ పెంబిలో 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన మాక్స్ సొసైటీ వేగంగా అభివృద్ధ్ది చెందిందని అభినందించారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసు కుంటే దేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకో వచ్చని, కొనుగోలు చేసుకోవచ్చని, అలాగే ప్రభు త్వం అందజేసే సబ్సిడీ పొందవచ్చని సూచిం చారు. 200-300 మంది రైతులు సంఘంగా ఏర్పడి ఎఫ్‌పీసీలో రిజిస్ట్రేషన్ చేసుకొని అభివృద్ధ్ది చెందాలని సూచించారు. ఆన్లైన్లో పంటలు ఎలా అమ్ముకోవాలో వివరించారు. ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని హార్టికల్చర్, సెరీకల్చర్ మండల అధికారి సూచించారు. అధికారులు, నాయకులను మాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మా నించారు. మ్యాక్స్ సొసైటీ అధ్యక్షుడు సల్లా రామే శ్వర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, హకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాకాల రాంచం దర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేంద ర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ భూక్యా గోవింద్, ఎన్సీడీఈఎక్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ రావు, రిలయన్స్ ఫౌండే షన్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బండారి రమేశ్, ఏఈ వో రాజ్‌కుమార్, సెరీకల్చర్ సహాయ సంచాల కుడు రాములు, రైతులు పాల్గొన్నారు.