
ఆదిలాబాద్, సెప్టెంబరు 23, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు ఏజెన్సీ గూడాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది. గ్రా మాల నుంచి మండల కేంద్రాలకు రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వానకాలంలో చినుకుపడితే చాలు రోడ్లపై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయేవి. ఈ సీజన్లో వ్యవసాయ పనులు, అ నారోగ్యంతో బాధపడే వారు చికిత్స కోసం మండల కేంద్రాలు, ఆదిలాబాద్‌కు రావాలం టే పాడైన రోడ్లతో నరకయాతన అనుభవించాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి పెద్దపీట వే సింది. రూ. 235 కోట్లతో మరమ్మతులు, ఒక వరుస రహదారిని రెండు వరుసలుగా మార్చడంతో పాటు రూ.45 కోట్లతో జిల్లాలో 20 వంతెనల నిర్మాణాలను చేపట్టింది. ఆదిలాబా ద్ నుంచి బేల వరకు అంతర్రాష్ట్ర రహదారి గతంలో అధ్వానంగా ఉండేది. ఈ మండలాల ప్రజలు తమ అవసరాల కోసం మండల కేం ద్రానికి, జిల్లా కేంద్రానికి రావాలన్నా చాలా ఇబ్బందులు పడేవారు. రూ. 55 కోట్లతో 32 కిలోమీటర్ల మేరు రెండు వరుసల రహదారిని నిర్మించడంతో ప్రజల ఇబ్బందులు దూరమయ్యాయి. జైనథ్ మండలం నీరాల వద్ద ఉన్న లో లెవల్ కాజ్వే వల్ల వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇక్కడ వంతెన నిర్మాణాన్ని చేపట్టడంతో బేల, జైనథ్ మండలాల ప్రజల ఇబ్బందులు దూరమయ్యాయి.
జిల్లాలో మెరుగైన రవాణా సౌకర్యం
గుడిహత్నూర్ నుంచి ఉట్నూర్ రహదారిని కూడా 11 కిలోమీటర్ల మేర రూ. 22 కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చారు. దీంతో పాటు తాంసి సుంకిడి, ఇచ్చోడ నుంచి బజార్హత్నూర్ 9 కిలోమీటర్ల రహదారిని కూడా రెం డు వరుసల రహదారిగా నిర్మించారు. ఆదిలాబాద్ పట్టణంలో 3.4 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్డును నాలుగు వరుసలుగా మార్చడంతో పాటు బజార్హత్నూర్ సోనాల, ఆదిలాబాద్ నుంచి బోథ్‌కు వెళ్లే రోడ్డును అభివృద్ధి చేశారు. అంతర్రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడంలో భాగంగా బోథ్, కిన్వట్ రోడ్డును 16 కిలోమీటర్ల మేర రూ. 36 కోట్లతో నిర్మిస్తుండగా, పనులు చివరి దశలో ఉన్నాయి. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుంటాలకు నేరడిగొండ నుంచి రెండువరుసల రహదారిని నిర్మించారు. తలమడుగు మండలం సుంకిడి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు, నార్నూర్ నుంచి భీంపూర్ వరకు 8 కిలోమీటర్లు, బేల నుంచి జైనథ్ వరకు 3 కిలోమీటర్ల రోడ్డును డబుల్‌లైన్‌గా మార్చారు.
20 వంతెనల నిర్మాణం
వానకాలం వచ్చిందంటే చాలు రోడ్లు, వంతెనలపై నుంచి నీరు ప్రవహించేది. దీంతో గ్రా మాలకు రాకపోకలు నిలిచిపోయేవి. వరద ప్ర వాహం తగ్గితే, ప్రజలు ఇబ్బందులు పడుతూ వంతెనలు దాటేవారు. వైద్యంకోసం వెళ్తున్న వారి పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా ఉండేది. ఈ సమస్య పరిష్కారం కోసం జి ల్లాలో రూ. 45 కోట్లతో 20 వంతెనలు నిర్మించారు. వీటి నిర్మాణంతో వానకాలం ఇబ్బందులు తప్పాయి. వానకాలంలో భారీ వర్షాలు కురిసినా మారుమూల, ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం
ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన రోడ్లు, వంతెనల కారణంగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగింది. గతంలో రహదారులు బా గా లేకపోవడంతో పాటు చిన్నపాటి వంతెనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వానకాలంలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రయాణం చేయాలంటే భయపడేవారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లే కుండా ప్రజలు పల్లెల నుంచి పట్టణాల దాకా ప్రయాణాలు సాగిస్తున్నారు.