
నార్నూర్, సెప్టెంబర్ 23 : ఉమ్మడి మండలం లో రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గాదిగూడ మండలం ఖడ్కి కల్వర్టు, లోకారి(కే)కల్వర్టులపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. ఖఢ్కి కల్వర్టులో మ్యాక్స్ వాహనం ఇరుక్కుపోయింది. స్థానికులు అప్రమత్తం కావ డంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణి కులను సురక్షితం గా బయటకు తీశారు. నార్నూర్ మండలం గుం డాయి చెక్‌డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు వరదలో చిక్కుకున్నా రు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ డీ రమేశ్, పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకు న్నారు. స్థానికులు, పోలీసులు తాడు సహాయం తో వారిని బయటకు తీశారు.
బోథ్‌లో..
రెండు రోజులుగా వర్షం కురుస్తున్నది. మర్లపెల్లిలోని నక్కలవాడ వద్ద వాగు వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంతో పాటు కొత్తపల్లె, రేండ్లపల్లె, లక్ష్మీపూర్ గిరిజనులు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వాగు దాటలేక గంటల తరబడి నిరీక్షించారు. రేండ్లపల్లెకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి వెళ్లిన వైద్యారోగ్య సిబ్బంది అక్కడే చిక్కుకు పోయారు. ఏఎన్ఎం కవిత, హెల్త్ అసిస్టెంట్ గోవింద్, ఉపాధ్యాయుడు కోసరావు వాగు దాటలేక మూడు గంటల పాటు వేచి ఉన్నా రు. సర్పంచ్ కొడప విజయ్, ఎంపీటీసీ గొడం జుగాదిరావు నీటి ప్రవాహం తగ్గే వరకు వారి వెంట ఉన్నారు. ధన్నూర్ (బీ), సొనాల, కౌఠ (బీ)లోని పంట పొలాల్లో నీరు నిలిచింది.
ఉప్పొంగిన వాగులు
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 23 : మండలంలోని సట్వాజీగూడ, మామిడిగూడ, జైత్రంతండా, జెం డాగూడ, సితాబట్ట గ్రామాల వాగులు పొంగి పొర్లాయి. మామిడిగూడ, జైత్రంతండా, సట్వా జీగూడ గ్రామాలకు దాదాపు రెండు గంటల పా టు రాకపోకలు నిలిచాయి. మండల కేంద్రంలో ఇళ్ల మధ్య నుంచి వరద ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
చిక్మాన్ వాగులో చిక్కున్న గొర్రెల కాపర్లు కాపాడిన పోలీసులు, గ్రామస్తులు
మండలంలోని చిక్ మాన్(రాంపూర్) వాగు వద్ద సిరికొండకు చెందిన గొర్రెల కాపర్లు అబ్బెన రవి, దత్తు, అంజ య్య జీవాలను మేపుతున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా వాగులోకి వరద వచ్చింది. దీంతో గొర్లతో పాటు వారు అందులోనే చిక్కుకు పోయారు. వారు కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు తహసీల్దార్ సర్ఫరాజ్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు కలిసి ఆ ముగ్గురిని వాగు దాటించి ప్రాణాలను కాపాడారు. 400 గొర్రెలు అక్కడే ఉన్నాయని, వరద ప్రవాహం తగ్గిన తర్వాత బయటకు తీసు కొస్తామని తహసీల్దార్ తెలిపారు. ఉప సర్పంచ్ చిన్న రాజన్న, బియ్యాల మల్లేశ్, అశోక్, ఆనంద్ రావ్, లస్మన్న, కానిస్టేబుళ్లు కాపాడారు.
పిడుగుపాటుతో ఐదు మేకలు మృతి
మండలంలోని గట్టెపల్లి పరిధి టేకిడిగూడలో పెందూర్ గుండాజీకి చెందిన ఐదు మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. ఎంపీటీసీ కుమ్ర జంగుబాయి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుండాజీ మేకలను మేప డానికి అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. మధ్యా హ్నం వేళలో వర్షం కురిసింది. పిడుగు పడడంతో ఐదు మేకలు మృతి చెందాయి. దీంతో రైతుకు దాదాపు రూ. 50 వేల దాకా నష్టం వాటిల్లినట్లు ఎంపీటీసీ తెలిపారు.