
బాసర, ఆగస్టు 3: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అ మ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను మంగళవారం ఆలయ చైర్మన్ శరత్‌పాఠక్, ఈవో వినోద్‌రెడ్డి ఆధ్వర్యలో సిబ్బంది లెక్కించా రు. 120 రోజులుగా భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలను లెక్కించగా, రూ. 36లక్షల 90వేల 24 నగదు సమకూరినట్లు తెలిపారు. అదే విధంగా మిశ్రమ బంగారం 51గ్రాములు, మిశ్రమ వెండి 1కిలో 790 గ్రాములు, 12 విదే శీ కరెన్సీలు సమకూరినట్లు అధికారులు తెలిపా రు. దేవస్థాన, బ్యాంక్ సిబ్బంది, జ్ఞాన సరస్వతీ సేవాసమితి సభ్యులు, శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జి ల్లాల సభ్యులు పాల్గొన్నారు.
బోనాల సమర్పణ
బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలోని శ్రీ మహంకాళి అమ్మవారికి గ్రామస్తులు మంగళవా రం బోనాలు సమర్పించారు. మహిళలు, గ్రామస్తులు బోనమెత్తుకొని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నా రు. అమ్మవారికి వస్ర్తాలు, నైవేద్యాలతో కూడిన బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నా రు. చల్లంగ చూడమని వేడుకున్నారు. ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారికి బోనాల పండుగను అధికారికంగా ప్రకటించాలని మండ ల జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, వీడీసీ సభ్యులు ఈ వో వినోద్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు.