నిర్మల్ అర్బన్, ఆగస్టు 3 : నిర్మల్ పట్టణంలోని బాగులవాడకు చెందిన మంచాల చిన్నయ్య కుటుంబానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అండగా నిలిచారు. చిన్నయ్య అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించారు. బుధవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో చిన్నయ్య తండ్రి భూమయ్యకు ఎల్వోసీ అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులున్నారు.