నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 27: ‘రెండు రోజుల్లోనే పరిస్థితి చేయిదాటింది.. మొదట యుద్ధ ప్రభావం ఉక్రెయిన్‌లోని తూర్పు భాగం వైపే ఉంటుందనుకున్నా. కానీ ఒక్కసారిగా మేం ఉంటున్న ప్రాంతంలో వార్ సైరన్ మోగించారు. చాలా భయమేసింది’ అని ఉక్రెయిన్ నుంచి జిల్లాకు చేరుకున్న వైద్య విద్యార్థి మహ్మద్ అబ్దుల్ రహీం తెలిపాడు. నిర్మల్ పట్టణం ఆదర్శనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ రహీం ఆదివారం రాత్రి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్య విద్యార్థులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఎంబసి అధికారులతో నిత్యం చర్చలు జరిపి విద్యార్థులను తీసుకొ చ్చేందుకు కృషి చేసింది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా నిత్యం అధికారులతో సంప్రదింపులు జరపడంతో తమ కుమారుడు తిరిగి వచ్చాడని రహీం తండ్రి మహ్మద్ అబ్దుల్ ఫహీం తెలిపారు. కుమారున్ని క్షేమంగా ఇంటికి తీసు కొచ్చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య విద్యను అభ్యసించేందుకు డిసెంబర్ 8న ఉక్రెయిన్‌కు వెళ్లాడని తెలిపారు.
‘వైద్య విద్య చదివేందుకు ఎన్నో ఆశలతో వెళ్లాం. ఒక్కసారిగా యుద్దం అనడంతో ఏం చేయాలో తోచక ఉక్కిరిబిక్కిరి అ య్యాం. నా స్నేహితులు కొందరు బంకర్లో తల దాచుకుం టున్నారు. మేం కొందరం భారత ఎంబసీ కార్యాలయానికి చేరుకున్నాం. అక్కడ 250 మంది విద్యార్థులకు ప్రత్యేక ైైైప్లెట్ ను ఏర్పాటు చేసింది. అందులో సురక్షితంగా ఢిల్లీకి చేరుకు న్నాం. అక్కడ మన రాష్ట్ర విద్యార్థులను ఒక్కచోట చేర్చి ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లి కడుపు నిండా భోజనం చే యించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా చేరుకున్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.