జైనథ్, సెప్టెంబర్ 14 : పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పోషణ మాసోత్సవం బుధవారం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు వండిన వంటకాలను జడ్పీటీసీ తుమ్మల అరుంధతితో కలిసి రుచిచూశారు. ఆరోగ్య లక్ష్మి పథకాన్ని కేంద్రాల్లో మెనూ ప్రకారం అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీవో వాణిశ్రీ, తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎంపీడీవో గజానన్‌రావ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, సూపర్వైజర్ శృతి, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 14 : మండలంలోని నాగల్కొండ గ్రామంలో పోషణ మాసోత్సవం నిర్వహించారు. సర్పంచ్ జాదవ్ సునీత, ఐసీడీఎస్ సూపర్వైజర్ వందన పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. అలాగే గర్భిణులకు సీమంతం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాదవత్ కళావతి, ఏఎన్ఎం మాన్కుబాయి, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 14 : మండలంలోని ముత్నూర్ సెక్టోర్ పరిధిలోని పాలోండిగూడ, సమక గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ జాదవ్ ప్రమీల 15 మంది బాలికలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం అందించాలి
ఎదులాపురం, సెప్టెంబర్ 14 : చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఖుర్షీద్‌నగర్ మెడికల్ ఆఫీసర్ స్నేహ అన్నారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో-1లో ఎత్తుకు తగ్గ బరువు, అతి తక్కువ బరువు గల పిల్లల తల్లులకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా పంపిణీ చేస్తున్న బాలమృతం పిల్లలకు అందించాలన్నారు. అతి తక్కువ బరువు గల పిల్లలకు రిమ్స్‌లోని ఎన్ఆర్సీకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీత, సూపర్వైజర్ ఫర్హా, అంగన్వాడీ కార్యకర్త.రాధ, ఏఎన్ఎంలు, అశ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.