నిర్మల్ అర్బన్, ఆగస్టు 26 : నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని మూడు నెలల్లోగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాన్ని మంత్రి పరిశీలించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి కలెక్టర్, అదనపు కలెక్టర్ చాంబర్, మీటింగ్ హాల్, ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పర్యవేక్షించారు. భవన ఆవరణలో జరుగుతున్న సుందరీకరణ, గార్డెనింగ్, అప్రోచ్ రోడ్డు తదితర పనులపై ఆరా తీశారు. నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. పనులను నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ కాలనీలో నిర్మిస్తున్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కృష్ణ శిలతో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ చౌరస్తాలో చేపడుతున్న మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు విగ్రహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, రాంకిషన్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, ఆగస్టు 26 : సారంగాపూర్ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లుగా నూతనంగా నియమితులైన వారికి శుక్రవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన నివాసంలో జీవో పత్రాలను అందజేశారు.
మార్కెట్ చైర్మన్ చిన్నోల్ల అశ్రుతారెడ్డి, వైస్ చైర్మన్ రాథోడ్ దత్తురాం, డైరెక్టర్లు జెల్ల అనిల్, గుమ్ముల మల్లేశ్, సింగం లక్ష్మీనారాయణగౌడ్, పాలపెద్ద వీరన్న, ఎస్కే రైస్ అహ్మద్, మీర్ద సాయన్న, ఒడ్డపెల్లి రమేశ్, కల్లూర్ వెంకట్, బొంతల పోశెట్టి, గౌని సాయినాథ్, ముత్యంరెడ్డి, రాంరెడ్డికి జీవో పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రిని శాలువాలతో సన్మానించారు.
ఇక్కడ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ ఆయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, ఆలూర్ పీఏసీఎస్ చైర్మన్ మాణిక్‌రెడ్డి, సర్పంచ్ రవీంద్రనాథ్‌రెడ్డి, నాయకులు నాగుల రాంరెడ్డి, మంతెన గంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లింగారెడ్డి, ఒలాత్రి నారాయణరెడ్డి పాల్గొన్నారు.