నార్నూర్, ఆగస్టు 31 : గ్రామీణ కమిటీల ఎంపిక ను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పిలుపునిచ్చారు. మండలంలోని భీంపూర్ గ్రామంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల తో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భాగస్వాములై జిల్లాలోని ప్రతి గ్రామంలో ఈ నెల 2న టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించాల ని సూచించారు. 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 51శాతం రిజర్వేషన్ పాటిస్తూ గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని తెలిపారు. గ్రామ కమిటీల నియామకంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు బాధ్యతగా పాల్గొనాలని సూచించారు. గ్రామాలను సందర్శించి కమిటీలను ఎన్నుకోవాలని, క్రియాశీలకంగా పనిచేసే వారిని నియమించాలన్నారు. సమావేశంలో నార్నూర్ ఎంపీటీసీ పరమేశ్వర్, సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, భీంపూర్ సర్పంచ్ రాథో డ్ విష్ణు, కోఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, తెలంగాణ ఆదర్శ పాఠశాల చైర్మన్ రాథోడ్ సుభాష్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు కొరల మహేందర్, టీఆర్ఎస్ నాయకులు కనక ప్రభాకర్, హైమద్, దుర్గే మహేందర్, సయ్యద్ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము అధ్యక్షత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి అల్లో ల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 2న టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను నిర్వహించాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఇందుకు గాను పట్టణంలోని 42 వార్డుల్లో పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుండి జెండా పండుగను దిగ్విజయం నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీ ప్రవేశ పెట్టని సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రవేశపెడుతున్నదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కోరే పార్టీలను మాత్ర మే ప్రజలు గెలిపిస్తారన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ సాజిద్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, సీనియర్ నాయకులు అయ్యన్నగారి రాజేందర్, ముడుసు సత్యనారాయణ, నజీర్, కోటగిరి అశోక్, కౌన్సిలర్లు సంపంగి రవి, పూదరి రాజేశ్వర్, ఎస్పీ రాజు, ఎడిపెల్లి నరేందర్, పూదరి రాజేశ్వర్, నాయకులు, కోఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.