తరలివచ్చిన ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్లు
పలు ప్రాంతాల్లో వలస పక్షుల సందడి.. కెమెరాల్లో చిత్రీకరణ
నేడు కూడా కార్యక్రమాలు..
ఏర్పాట్లు చేసిన అధికారులు
జన్నారం, ఫిబ్రవరి 12 : కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్‌లో శనివారం బర్డ్‌వాక్ ఫెస్టివల్ ప్రారంభం కాగా, సందర్శకులతో కళకళలాడింది. ఎఫ్‌డీవో మాధవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 60 మంది ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు తరలివచ్చారు. ఇందన్‌పెల్లి రేంజ్‌లోని మైసమ్మకుంట, గనిశెట్టికుంట, కలపకుంట, బైసన్‌కుంట, గోండుగూడ ప్రాంతాల్లో వలస పక్షులు కిలకిలరావాలతో సందడి చేయగా, వాటిని వీక్షిస్తూ తమ కెమెరాల్లో బంధించారు. అదివారం కూడా అడవుల్లో కలియదిరుగుతూ అరుదైన జాతులను గుర్తించనుండగా, అటవీశాఖ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు.
మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్‌లో శనివారం నిర్వహించిన బర్డ్‌వాక్ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఎఫ్‌డీవో మాధవరావు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించగా, వివిధ ప్రాంతాల నుంచి 60 మంది ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు తరలివచ్చారు. రెండు గ్రూపులుగా విభజించి ప్రత్యేక వాహనాల్లో అడవుల్లోకి తీసుకెళ్లారు. డివిజన్లోని ఇందన్‌పెల్లి రేంజ్లో గల మైసమ్మకుంట, గనిశెట్టికుంట, కలపకుంట, బైసన్‌కుంట,గోండుగూడ ప్రాంతాల్లో సందడి చేస్తున్న వలస పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. అక్కడక్కడా వన్యప్రాణులు కూడా కనిపించడంతో చిత్రీకరించారు. ఈ ఫారెస్ట్‌లో 300 రకాల పక్షులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌కు వచ్చిన వారి కోసం ఎఫ్‌డీవో మాధవరావు, రేంజ్ అధికారులు హఫీసొద్ద్దీన్, రత్నాకర్‌రావు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి అడవుల్లోనే విడిది చేయనున్నారు. ఆదివారం కూడా వివిధ ప్రాంతాల్లో కలియదిరిగి అరుదైన జాతులను గుర్తించనున్నారు.