అభినందించిన మంత్రి అల్లోల, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన విఠల్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండె విఠల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశా రు. ఆయనకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ అభినందనలు తెలి పారు హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన ప్రమా ణ స్వీకారం కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. మంచి ర్యాల నుంచి యువ నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నా యకులు హా జరయ్యారు. కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మె ల్సీ దండె విఠల్ సీఎం కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం పొం దారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.