ఎదులాపురం, ఫిబ్రవరి 20 : ఆదిలాబాద్ జిల్లాలోని మాజీ సైనికులు ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్నను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనం దున ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువా తో సన్మానించారు. అనంతరం మాజీ సైనికులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. 5 ఎకరాల స్థలంతో పాటు సంఘ భవన నిర్మాణా నికి నిధులు కేటాయించాలని, ఇళ్ల స్థలాలు ఇప్పిం చాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సైనికుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు మాదాస్ శంకర్‌దాస్, నాయకులు అశోక్, ఆరె దేవన్న, సోమేశ్వర్, వామన్‌రెడ్డి, రంగస్వామి, అజీమ్ ఉద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు గర్వకారణం
ఎదులాపురం, ఫిబ్రవరి 20 : అమెరికాలో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఎల్ఐసీ సమావే శంలో మొట్టమొదటిసారిగా 11వ ర్యాంకు సాధిం చిన ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సీహెచ్ మహేందర్బాబును ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసీ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొట్టమొదటిసారి మహేందర్‌బాబు నేతృత్వంలో 15 మందితో కూడిన టీం అమెరికాలో నిర్వహించనున్న ఆల్ ఇండియా సమావేశానికి హాజరు కావడం ఆదిలా బాద్ జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మహేం దర్బాబు ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా 2వ ర్యాంకు సాధించినందుకు అభినందించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రాజేశ్వర్, ఏఎం సీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, న్యాయవాది శ్రీకాంత్, గణేశ్, కృష్ణ, దేవన్న, రాజు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.