ఆపరేటర్ నిర్లక్ష్యం..ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ పరిస్థితి విషమం..రిమ్స్‌కు తరలింపు

ఇచ్చోడ: విద్యుత్ శాఖ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్ల ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని రిమ్స్ దవాఖానకు తరలించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని సిరిచెల్మ గ్రామానికి చెందిన పాముల మల్లేశ్ కొంతకాలం నుంచి ఎలక్ట్రీషియన్‌గా పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. దీంట్లో భాగంగా మండలంలోని కోకస్మన్నూర్ గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గ్రామ సర్పంచ్ గంగారాం కోరిక మేరకు విద్యుత్ పునరుద్ధరణ పనులను ఇచ్చోడ ట్రాన్స్‌కో కార్యాలయంలో ఆపరేటర్ షేక్ వలీకి మల్లేశ్ పోన్ చేసి, లైన్ క్లీయర్ (ఎల్సీ) తీసుకున్నాడు.
ఎల్సీ తీసుకున్న విషయాన్ని గమనించకుండానే ఆపరేటర్ విద్యుత్ సరఫరా ఆన్ చేయడంతో కరెంట్ స్తంభంపై ఉన్న అతడు విద్యుత్ఘాతానికి గురయ్యాడు. స్థానికంగా ఉన్న యువకులు మినిట్రాన్స్ఫార్మర్ వైర్‌ను కర్రతో తొలగించి తీగలపై వేలాడుతున్న అతన్ని కిందికి దించి ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఇచ్చోడలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆపరేటర్‌పై శాఖపరమైన చర్యలు తీసుకుంటానని ఏఈ రవి కుమార్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఫరీద్ తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

