పార్టీలతో సంబంధం లేదు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 21 : జిల్లా కేంద్రంలో పార్టీలతో సంబంధం లేకుండా నిధు లు మంజూరు చేస్తూ వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని మహేశ్వరి థియేటర్ మార్గంలో రూ.26లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామ న్నారు. 33వ వార్డు బీజేపీ కౌన్సిలర్ స్వప్న వార్డులో ఇప్పటి వరకు వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.1.5కోట్లు మంజూరు చేశామని, ప్రజా సమస్యలు పరిష్కరించడం మనందరి కర్తవ్యమన్నారు. ఎన్నికల హామీలను నెరవేరు స్తానని పేర్కొన్నారు. అన్నివార్డులకు నిధులు మం జూరు చేస్తున్నందుకు బీజేపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్లు బండారి సతీశ్, అజయ్, ప్రకాశ్, కృష్ణ, రాంకుమార్ పాల్గొన్నారు.
పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు…
జైనథ్, ఫిబ్రవరి 21 : సాత్నాల ప్రాజెక్టువద్ద పర్యాటకులకు ఆహ్లాదం అందించేందుకు అవసర మైన ఏర్పాట్లు చేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సత్నాల ప్రాజెక్టు వద్ద ఫామ్‌హౌస్‌ను నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు యూని స్ అక్బానీ, సాజిదుద్దీన్ ఉన్నారు. జామినిలో గడ్డం రవీందర్ ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.