ట్రెండీ డ్రెస్, చుడీదార్, లంగావోణి, షార్ట్ డ్రెస్..ఇలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కెమెరా కంట పడుతూ ఉంటుంది బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్. కాస్ట్యూమ్స్ కే వన్నె తెచ్చే అందం జాన్వీ సొంతం. ఈ భామ ఎప్పుడు ఎక్కడికెళ్లినా కెమెరాల వెంటపడుతూనే ఉంటాయి.
అందాల సోయగాన్ని కెమెరాల్లో బంధిస్తుంటారు ఫొటోగ్రాఫర్లు. అయితే జాన్వీ ఎప్పుడు బయటకు వెళ్లిన ఈ అమ్మడు దగ్గర ఓ వస్తువు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంతకీ ఆ వస్తువేంటనే కదా మీ డౌటు..అదేనండి జాన్వీ హ్యాండ్‌బ్యాగ్. ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ వెంట తెచ్చుకోవడం కామనే కదా అనుకుంటున్నారా..! ఆ విషయంలోకి వెళ్దాం.
జాన్వీకపూర్ హ్యాండ్ బ్యాగ్ చాలా స్పెషల్. వెకేషన్ బట్టి బ్యాగ్ ను మారుస్తుంటుంది జాన్వీ. ట్రెండీ డ్రెస్‌ల మాదిరిగానే ఖరీదైన బ్యాగులను తీసుకెళ్తుంటుంది. సుమారు రూ.65 వేల నుంచి రూ.3 లక్షల విలువైన హ్యాండ్ బ్యాగ్స్ అంటే స్పెషలేగా మరి. జాన్వీ హ్యాండ్ బ్యాగ్‌లపై ఓ లుక్కేయండి మరి.