న్యూఢిల్లీ, మే 6 : దేశీయ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను గూడ్స్, సర్వీసెస్ ఎగుమతులు 4.59 శాతం వృద్ధితో 863.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎగుమతులు పుంజుకోవడం విశేషమని పేర్కొంది.