హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘ఓజీ’ సినిమా టికెట్ల రేట్ల పెంపు ప్రభుత్వంలో చిచ్చుపెట్టింది. తనకు తెలియకుండా ‘ఓజీ’ సినిమా టికెట్ రేట్లను పెంచడంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. టికె ట్ రేట్ల పెంపు జీవోను కొట్టివేస్తూ.. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను తాను స్వాగతిస్తున్నానని తెలిపారు. తన శాఖకు సంబంధించి హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జీవో విడుదల చేయడంపై మంత్రి మండిపడ్డారు. తన అనుమతిలేకుండానే జీవో ఇచ్చారని అసహనం వ్యక్తంచేశారు. తె లంగాణలో ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదిలేదని స్పష్టంచేశారు. ఇకమీదట ఇ లాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని, ప్రజలపై భారం పడకుండా ఉండాలనే ఉ ద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తె లిపారు. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా అన్ని చిత్రాలకూ ఒకే టికెట్ రేటు ఉంటుందని, రేట్ల పెంపు ఉండదన్నారు.