బతుకమ్మ వచ్చిందంటే ఆడపిల్లలకు మహా సంబురం. చిన్న పిల్లలైతే మరీ ముద్దుగా ముస్తాబై చిట్టిచిట్టి చేతులతో బతుకమ్మ ఆడుతూ అందరినీ ఆకర్షిస్తారు. ఈసారి కూడా ముద్దులొలికే చిన్నారులను బుట్ట బొమ్మల్లా అలంకరించేందుకు పట్టు లంగాల డిజైన్లు సిద్ధంగా ఉన్నాయి.
పైథానీ జతగా..
గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో డిజైన్ చేసిన లంగావోణీ ఇది. బాటమ్ కోసం గ్రీన్‌కలర్ బనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దానికి ఎల్లో కలర్ పైథానీ బార్డర్ జతచేశారు. బ్లౌజ్ కోసం గ్రీన్‌కలర్ రా సిల్క్ పై బార్డర్‌కు కాంట్రాస్ట్‌గా ఎల్లో కలర్ స్టోన్స్‌తో మగ్గం వర్క్ చేశారు. ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి నెక్లైన్ లీఫ్ కట్‌తో వర్క్ చేశారు. కాంబినేషన్‌గా రెడ్ కలర్ కలంకారీ దుపట్టాపై ఎల్లో కలర్ మగ్గం వర్క్ బార్డర్ జతచేయడంతో నిండుదనం వచ్చింది.
చందేరీ సొగసు..
మహిళల మనసుదోచే చందేరీ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లంగావోణీ ఇది. బాటమ్ కోసం పేస్టల్ బ్లూ కలర్ చందేరీ ఫ్యాబ్రిక్‌పై బుటీస్ వర్క్ చేశారు. నిండైన ఎరుపురంగుతో పది అంగుళాల కంచిపట్టు బార్డర్ జతచేయడంతో హైలైట్ అయ్యింది. బ్లౌజ్ కోసం గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్‌పై ఫుల్ సీక్వెన్స్ వర్క్ చేసి హైనెక్ ఇచ్చారు. స్లీవ్‌లెస్ హ్యాండ్స్ జోడించి.. ప్రిల్స్ జతచేయడంతో ట్రెండీలుక్ వచ్చింది. రెడ్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై చిన్నచిన్న బుటీస్ వర్క్ చేసిన బ్లూ కలర్ బార్డర్ దుపట్టా
అదనపు ఆకర్షణ.
మోడల్: హద్విత
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335