రసాయనాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే.. అందం కన్నా అపాయమే ముందుగా పలకరిస్తుంది. అంతేకాకుండా, సున్నితమైన చర్మం ఉంటే.. పరిస్థితి మరింత దిగజారుతుంది. సైడ్ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. చిన్నచిన్న మొటిమలు, నల్ల మచ్చలను తగ్గించుకోవాలన్నా.. నానా తిప్పలు పడాలి. అలాంటివారు ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఫేస్‌ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు.
నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిపాలలో రెండు మూడు టీస్పూన్ల నారింజ రసం, ఒక్కో టీస్పూన్ చొప్పున వేప, తులసి ఆకుల పొడి వేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, నల్ల మచ్చలు ఉన్నదగ్గర అప్లయి చేయాలి. అరగంటపాటు అలాగే వదిలేసి.. గోరు వెచ్చటినీటితో కడిగేయాలి. తులసి, వేపలోని యాంటి బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి. పచ్చిపాలు, నారింజ రసం.. చర్మానికి సరికొత్త మెరుపును అందిస్తాయి. ఇవన్నీ సహజసిద్ధమైన పదార్థాలు కాబట్టి.. చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. ఈ ఫేస్‌ప్యాక్‌ను రెగ్యులర్‌గా వాడితే.. మొటిమలు, నల్లమచ్చలు తగ్గి, ముఖం కాంతిమంతంగా మారుతుంది.