e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home ఆరోగ్యం ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం

ఆరోగ్యాన్ని ప్రసాదించే.. కటి చక్రాసనం

యోగాసనాల్లో సులువైనది, ఆరోగ్యాన్ని ప్రసాదించేది కటి చక్రాసనం. చేతుల కదలికలపై ఆధారపడి ఉండే ఈ ఆసనాన్ని సాధన చేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు. వీపు, వెన్ను, నడుము భాగాలపై ఒత్తిడిని దూరం చేసే కటి చక్రాసనం ఎలా వేయాలంటే..

  • ముందుగా చేతులను వదులుగా విడిచి, నిటారుగా నిల్చోవాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ ఎడమ అరచేతిని కుడి భుజంపై ఉంచాలి.
  • ఇప్పుడు శ్వాస వదులుతూ కుడిచేతిని వీపుపైకి తీసుకెళ్లి అరచేతిని నడుముపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ అరచేతిని మెడ వెనుక భాగాన్ని పుష్‌ చేస్తూ నిదానంగా కుడివైపునకు మెడను తిప్పి చూడాలి. ఈ స్థితిలో 20 సెకండ్లు ఉండాలి. ఈ సమయంలో శ్వాసక్రియ నిదానంగా సాగేలా చూసుకోవాలి. మళ్లీ యథాస్థితికి చేరుకోవాలి.
  • ఇప్పుడు కుడి అరచేతిని భుజంపై ఉంచి, ఎడమ చేతిని వీపుపైకి తీసుకెళ్లి అరచేతిని నడుముపై ఉంచాలి. కుడి అరచేతితో మెడను పుష్‌ చేస్తూ, మెడను ఎడమ
  • వైపునకు తిప్పాలి. ఈ స్థితిలో 20 సెకండ్లు ఉన్న తర్వాత, యథాస్థితికి రావాలి.
  • ఈ ఆసనం వేయడం వల్ల ఛాతీ వైశాల్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మెడ, భుజాలు, నడుము, తుంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం దూరమవుతుంది. నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే, ఈ ఆసనాన్ని వేయాలి.
  • కండ్లు తిరుగుతున్నా, వ్జైనా నుంచి రక్తస్రావం అవుతున్నా, వాంతులు అవుతున్నట్టు అనిపించినా ఈ ఆసనం ప్రయత్నించొద్దు.

అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement