RCB vs SRH : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫ్ఫీ(3-17) విజృంభణతో స్వల్ప వ్యవధిలో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది. విధ్వంసక ఓపెనర్లు అభిషేక్ శర్మ(7), ట్రావిస్ హెడ్(11)లు ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చిన డఫ్ఫీ ఆ తర్వాతి ఓవర్లో నితీశ్ రెడ్డి(1)ని బోల్తా కొట్టించి ఆరెంజ్ ఆర్మీని ఒత్తిడిలో పడేశాడు.
ఆరంభ పోరులో టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తొలి ఓవర్లో సిక్సర్‌తో అలరించిన అభిషేక్ శర్మ(7) దూకుడు పెంచే క్రమంలో టైమింగ్ కుదరక జాకబ్ డఫ్ఫీ(3-17) ఓవర్లో వెనుదిరిగాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ట్రావిస్ హెడ్(11) బౌండరీ లైన్ వద్ద సాల్ట్ చేతికి చిక్కాడు. దాంతో.. రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
What a way to announce your arrival in the #TATAIPL! 🔥#RCB fans, how would you rate Jacob Duffy’s fiery debut start in the powerplay? ❤️
Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH | @RCBTweets pic.twitter.com/83xl62EnDO
— IndianPremierLeague (@IPL) March 28, 2026
అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్(23 నాటౌట్) జతగా క్రీజులో నిలుస్తాడనుకున్న నితీశ్ రెడ్డి(1) సైతం తేలికగావికెట్ ఇచ్చేశాడు. డఫ్ఫీ బౌలింగ్‌లోనే పేలవ షాట్ ఆడి చేతికి చిక్కాడు. మూడు వికెట్లు పడిన వేళ అభినందన్ సింగ్ ఓవర్లో్ రెచ్చిపోయిన ఇషాన్ వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ బాదడంతో స్కోర్ 50కి చేరువైంది. పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి ఎస్ఆర్హెచ్ 49 పరుగులు చేసింది.