Exercise | వ్యాయామానికి తగిన సమయం ఏది?
గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే మంచిదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సుమారు 30,000 మంది పెద్దలకు సంబంధించిన సమాచారాన్ని దాదాపు ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు. వీళ్లంతా కూడా అధికబరువుతోనో లేదంటే, టైప్ 2 డయాబెటిస్తోనో బాధపడుతున్న వాళ్లే కావడం గమనార్హం.
Exercise | గుండె ఆరోగ్యంగా ఉండటానికి సాయంత్రం వేళల్లో వ్యాయామం చేస్తే మంచిదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులు సుమారు 30,000 మంది పెద్దలకు సంబంధించిన సమాచారాన్ని దాదాపు ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు. వీళ్లంతా కూడా అధికబరువుతోనో లేదంటే, టైప్ 2 డయాబెటిస్తోనో బాధపడుతున్న వాళ్లే కావడం గమనార్హం. ఈ సమాచారం నుంచి ఎనిమిదేళ్లు గడిచిన తర్వాత వ్యాయామం చేస్తున్న వాళ్లలో దాదాపుగా గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, మరణాల సంఖ్య.. వ్యాయామం చేయనివారితో పోలిస్తే చాలా తక్కువగా ఉందని తేలింది.
వీరిలో కూడా సాయంత్రం వేళ వ్యాయామం చేసినవాళ్లలో ఆరోగ్య సమస్యలు ఇంకా చాలా తక్కువగా ఉన్నాయట. అలాగని సాయంత్రం వ్యాయామం చేయడం లేదని ఆందోళన చెందవద్దని పరిశోధకుల మాట. ఎందుకంటే ఉదయం వేళ వ్యాయామం గుండె ఆరోగ్యానికి, నాణ్యమైన నిద్రకు, మేధాశక్తి పెరగడానికి, బరువు తగ్గడానికి మంచిదని కిందటి అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి సమయం ఏదనే దానితో సంబంధం లేకుండా వ్యాయామం మాత్రం చేయాలని మాత్రం గుర్తుంచుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

