Emergency Fund | ఎమర్జెన్సీ నిధి అంటే ఏంటి? కష్టకాలంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది
Emergency Fund | మాకు పెండ్లయి నాలుగేండ్లు అవుతున్నది. ఇద్దరం చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్లం. అయితే, లాక్డౌన్లో నేను పనిచేసే బేకరీ మూతపడింది. అప్పటినుంచి ఇంట్లోనే ఉంటున్నా. మా ఆయన ఒక్కడే రూ.18వేల జీతానికి పని చేస్తున్నాడు. మా ఇద్దరికీ కరోనా సోకినప్పుడు ఆర్థికంగా ఇబ్బందిపడ్డాం. ఈ మధ్యనే నేను రూ.15వేల జీతానికి కొత్త కొలువులో చేరాను. కష్టసమయాల్లో ఉపయోగపడేలా కొంత డబ్బు ఆదా చేయాలని అనుకుంటున్నాం. అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) ఉద్దేశాన్ని వివరిస్తారా?
l ఓ సోదరి
జ: జీవితం సాఫీగా సాగాలంటే ‘ఆర్థిక భద్రత’ తప్పనిసరి. అనారోగ్యం, నిరుద్యోగం మొదలైన సమస్యలు చుట్టు ముట్టినప్పుడు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఓ రక్షణ కవచం ఉండాల్సిందే. అత్యవసర నిధితోనే ఆ భరోసా సాధ్యం అవుతుంది. దీన్నే ‘రిస్క్ మేనేజ్మెంట్’ అనీ అంటారు. గతంలో మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి, ఇప్పటికైనా కుటుంబానికి ఆరోగ్య బీమా తీసుకోండి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ హెల్త్ కవరేజ్ పెంచుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో దవాఖానలో చేరినా ఆర్థిక భారం పడకుండా సామాన్య హెల్త్ కవర్‌ను ఎంచుకోవచ్చు. అలాగే భవిష్యత్‌లో ఉన్నట్టుండి ఉద్యోగం పోయినా, అనుకోని వ్యయాలు ఎదురైనా కుటుంబ పోషణకు ఇబ్బంది కాకుండా.. ఇప్పటినుంచే నెలవారీ సంపాదనలో కొద్దికొద్దిగా కూడబెట్టుకోవాలి. కనీసం నాలుగైదు నెలలు ఇల్లు గడిచేందుకు అవసరమయ్యే మొత్తాన్ని అత్యవసర నిధిగా సమీకరించుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో ఆ డబ్బును వాడుకోవాల్సి వస్తే, తిరిగి అంతే మొత్తాన్ని వీలైనంత త్వరగా నిధికి జమ చేయాలి. వీటితోపాటు టర్మ్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. మీది చిన్న వయసే కాబట్టి, ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది.
– దీప నిట్టల, చార్టర్డ్ వెల్త్ మేనేజర్, డైరెక్టర్, శ్రీమంత్రణ ఫైనాన్షియల్ సర్వీసెస్
Read More :
IT deduction Claims | ఇలా కూడా ఐటీ క్లెయిమ్స్.. పేరెంట్స్‌కు గిఫ్ట్.. హెల్త్ బీమా వగైరా!
Yezdi Bikes | అప్పట్లో కుర్రకారు మతులు పోగొట్టిన యెజ్డీ జావా బైకులు మళ్లీ వచ్చేస్తున్నాయ్..
LIC Jeevan Labh | రోజూ రూ.233 మదుపు.. రూ.17 లక్షల రిటర్న్స్.. ఎలాగంటే?
Gold Loans in Banks | బంగారంపై చౌకగా రుణాలు.. ఏ బ్యాంకులో ఎంతంటే?!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

