LIC Jeevan Labh | ఇన్వెస్టర్లు.. మదుపర్ల కోసం భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఫథకాలు తీసుకొస్తున్నది. తక్కువ గడువుతో కూడిన ఇన్వెస్ట్మెంట్ పాలసీలు తీసుకొస్తున్నది. ఎల్ఐసీ పథకాల్లో ఇన్వెస్టర్లు పెట్టే పెట్టుబడులతో రిటైర్మెంట్ తర్వాత వారి సురక్షిత భవితవ్యానికి మార్గం సుగమం అవుతుంది. అందులో భాగంగా ఎల్ఐసీ.. జీవన్ లాభ్ అనే పథకాన్నీతీసుకొచ్చింది. ప్రతి రోజూ రూ.233 చొప్పున ప్రతి నెలా సుమారు రూ.7000 ప్రీమియం చెల్లిస్తే.. మెచ్యూరిటీ సమయానికి రూ.17 లక్షలు పొందొచ్చు. అంతే కాదు.. ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ కింద పెట్టుబడిని ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపుకు వాడుకోవచ్చు. రిటర్న్స్ కూడా స్టాక్ మార్కెట్లతో సంబంధం లేకుండా వస్తాయి.
ఈ పాలసీలో చేరడానికి కనీస వయస్సు ఎనిమిదేండ్లు కాగా, గరిష్ఠంగా 59 ఏండ్ల వయస్సు గల వారు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ గడువు 16 ఏండ్ల నుంచి 25 ఏండ్లు ఉంటుంది. కనీస మొత్తం రూ.2 లక్షల రిటర్న్స్ వస్తాయి. మూడేండ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత దానిపై రుణాలు కూడా తీసుకోవచ్చు. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే నామినీకి అష్యూర్డ్ రిటర్న్.. బోనస్ అందజేస్తారు.
54 ఏండ్ల వయస్సు గల వారు 21 ఏండ్లు, అంతకంటే తక్కువ గడువు పాలసీ తీసుకోవాలి. 50 ఏండ్ల వారు మాత్రం 25 ఏండ్ల గడువు పాలసీ తీసుకోవచ్చు. ఒకవేళ పాలసీ దారు మరణిస్తే.. ఇన్వెస్టర్ నామినీకి మరణించే వరకుబెనిఫిట్లు, ఫైనల్ అడిషనల్ బోనస్, సింపుల్ రివిజినరీ బోనస్ తదితర బెనిఫిట్లు లభిస్తాయి.