IT deduction Claims | ఇలా కూడా ఐటీ క్లెయిమ్స్.. పేరెంట్స్‌కు గిఫ్ట్.. హెల్త్ బీమా వగైరా!
IT deduction Claims | వేతన జీవులు తమ తల్లిదండ్రులకు గిఫ్ట్‌లు, హెచ్ఆర్ఏ, హెల్త్ బీమా పేమెంట్స్ టాక్స్ డిడక్షన్‌కు వాడుకోవచ్చు.

IT deduction Claims |వేతన జీవులు ప్రతిఏటా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. పన్ను చెల్లింపులు తగ్గించుకోవడానికి పలు పన్ను మినహాయింపు ఆప్షన్లు ఉన్నాయి. పన్ను భారం తగ్గించుకునే ఆప్షన్లలో పాపులారిటీ లేనివీ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు.. మరీ ప్రత్యేకించి వారికి మీ చేయూత కూడా టాక్స్ డిడక్షన్ కింద వాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రులను విశ్వాసంలోకి తీసుకోవచ్చు. తల్లిదండ్రులకు గిఫ్టింగ్ ప్రొవిజన్ కింద చేసే పెట్టుబడులు పన్నేతర ఆదాయం కిందకు వస్తాయి. వాటిలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, ఫోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి ఇతర పన్ను ఆదా పథకాలు ఉన్నాయి.
పొదుపు పథకాలపై ఇలా క్లయిమ్స్
సీనియర్ సిటిజన్స్‌గా తల్లిదండ్రుల పేరిట ప్రాథమికంగా రూ.3 లక్షలు.. 80 ఏండ్లు దాటిన వారికి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏండ్లు, ఆ పై వయస్సు గల వారిపై బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీల్లో రూ.50 వేల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంపై పన్ను రాయితీ లభిస్తుంది. పన్ను పరిమితికి మించి ఎక్కువ వడ్డీ ఆదాయం లభిస్తే.. గరిష్ట వడ్డీ ఆదాయం మినహాయింపు కిందకే వస్తుంది. పిల్లల నుంచి తల్లిదండ్రులు గిఫ్ట్ రూపేణా పొందే మనీపై వచ్చే ఆదాయం.. ఆదాయ మార్గంగా పరిగణించరు.
పేరెంట్స్‌కు హెచ్ఆర్ఏ క్లయిం ఇలా
వేతన జీవుల్లో చాలా మంది తమ పేరెంట్స్ ఇండ్లలోనే ఉన్నారనుకోండి.. కానీ వారితో కలిసి ఉండక పోతే ఇంటి అద్దె చెల్లించొచ్చు. దీనిపై హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) కింద ఆదాయం పన్ను చట్టంలోని 10 (13ఏ) సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిం చేయొచ్చు. అధిక ఆదాయం గల వారైనా.. తక్కువ ఆదాయ వర్గాల వారైనా బెనిఫిట్ పొందొచ్చు. అయితే, మీ తల్లిదండ్రుల యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్)లో రెంట్ సొమ్ము చెల్లించినట్లు రికార్డై ఉండాలి. దీన్ని ఐటీ అధికారులు తనిఖీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ
కరోనా మహమ్మారి తర్వాత డిపెండెంట్ తల్లిదండ్రులున్న వారికి ఈ ఆప్షన్ ముఖ్యమైంది. ఆదాయం పన్ను చట్టంలోని 80డీ సెక్షన్ కింద 60 ఏండ్ల లోపు తల్లిదండ్రులకు రూ.25 వేల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్లయిమ్ చేసుకోవచ్చు. 50 ఏండ్లు దాటిన వారైతే రూ.50 వేల మినహాయింపు పొందొచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

