శాకాహారికి.. విటమిన్-బీ12
ఎర్రరక్త కణాలు, డీఎన్ఏ తయారీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది విటమిన్- బీ12. ఇది లోపిస్తే నాడీవ్యవస్థ దెబ్బతినడం, రక్తహీనత, తిమ్మిర్లు, కండరాల బలహీనత, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మలబద్ధకం తదితర సమస్యలు చుట్టుముడతాయి.
ఎర్రరక్త కణాలు, డీఎన్ఏ తయారీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది విటమిన్- బీ12. ఇది లోపిస్తే నాడీవ్యవస్థ దెబ్బతినడం, రక్తహీనత, తిమ్మిర్లు, కండరాల బలహీనత, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మలబద్ధకం తదితర సమస్యలు చుట్టుముడతాయి. అయితే, బీ12 విటమిన్ ఎక్కువగా మాంసాహారంలోనే లభిస్తుంది. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి? ఏ ఆహారం తింటే ఆ లోటును భర్తీ చేసుకోగలరు?
- బచ్చలికూర విటమిన్ బీ12 ఉత్పత్తికి ఎంతో దోహదపడుతుంది. అందుకే దీన్ని ‘సూపర్‌ఫుడ్’ అంటారు. మల్టీ విటమిన్లకు చిరునామా అయిన బచ్చలికూరతో సూప్‌ల నుంచి స్మూతీస్ వరకు ఏదైనా చేసుకోవచ్చు.
- శాకాహారులు బీట్రూట్ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండటంతో పాటు విటమిన్ బీ12 పెరుగుదలకు సాయపడుతుంది.
- శనగలను కూరల్లో భాగం చేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. వీటి ద్వారా ఫైబర్, ప్రొటీన్ ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. చికెన్ తిననివారు కచ్చితంగా శనగలు ఆరగించాలి.
- పాల ఉత్పత్తులు శాకాహారులకు ఒక వరమని చెప్పవచ్చు. పెరుగు, పనీర్‌లలో విటమిన్ బీ12 అపారంగా ఉంటుంది. సోయా మిల్క్, పనీర్ టోఫు మొదలైనవాటిని కూడా ప్రయత్నించవచ్చు.
- పాలు విరిగిన నీటిలో బీ12 ఉత్పత్తికి అవసరమయ్యే ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అందుకే, ఆ నీటిని పారబోయకుండా పప్పు ఉడికించేందుకు వాడుకోవచ్చు.
- విటమిన్ బీ12 అత్యవసరమైనప్పుడు పాలు, గుడ్లు, మష్రూమ్స్ ద్వారా.. ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

