కళ్లద్దాలు అంటే చూపుని మెరుగుపరచడం.. కంటి రక్షణకి మాత్రమే కాదు.. అందాన్ని పెంచుతాయి. ఈ కండ్లజోడు అంతకుమించి. స్మార్ట్ దునియాలో రూపుదిద్దుకున్న ఈ డిజిటల్ గాగుల్స్ ప్రపంచాన్ని మీ కండ్ల ముందుంచుతాయి. మెటా కంపెనీ, రే-బాన్ కలిసి తీసుకొచ్చిన స్మార్ట్ గాగుల్స్ మనదేశంలో ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని ధరించి ‘హే మెటా’ అంటే చాలు.. మీ గాగుల్స్ మీకు అసిస్టెంట్‌లా పనిచేస్తాయి.
చెబితే ఫొటోలు క్లిక్ మనిపిస్తాయి. ప్రకృతి అందాలు మీరు వీక్షిస్తూనే, కోరినన్ని ఫొటోలు క్యాప్చర్ చేయొచ్చు. అంటే.. మీరు ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ ఫొటో తీసేయొచ్చన్నమాట. వీడియో రికార్డ్ కూడా చేసిపెడతాయి. బోర్‌గా ఫీలైనప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ ప్లే చేయమంటే తక్షణం వినిపిస్తాయి. అంతేకాదు, ఈ కండ్లజోడు ట్రాన్స్లేటర్గానూ మారిపోతాయి. రియల్ టైమ్‌లోనే పలు భాషలను మీరు కోరుకున్న భాషలోకి తర్జుమా చేసి వినిపిస్తాయి. ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌ని త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నారు. వీటిని ధరించి బయటికి వెళ్తే.. టెక్ లవర్‌గానే కాదు, ైస్టెల్ ఐకాన్‌గానూ హైలైట్ అవుతారు.